Twitter blue: ట్విటర్ యూజర్లకు కీలక అప్‌డేట్... 1 గంట వరకు పెంపు...

ABN , First Publish Date - 2023-06-07T20:11:50+05:30 IST

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) సారధ్యం చేపట్టాక కొత్తకొత్త ఆఫర్లు, ఫీచర్లతో యూజర్ల ముందుకొస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విటర్’ (Twitter) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లూ సబ్‌స్ర్కిప్షన్’ (Blue subscribers) కలిగివున్న యూజర్లు తమ ట్వీట్‌ను ఎడిట్ చేసుకునేందుకు ఇకపై 1 గంట సమయమిస్తున్నట్టు ప్రకటించింది.

Twitter blue: ట్విటర్ యూజర్లకు కీలక అప్‌డేట్... 1 గంట వరకు పెంపు...

న్యూఢిల్లీ: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) నియంత్రణలోకి వెళ్లాక కొత్తకొత్త ఆఫర్లు, ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విటర్’ (Twitter) మరో కీలక ప్రకటన చేసింది. ‘బ్లూ సబ్‌స్ర్కిప్షన్’ (Blue subscribers) కలిగివున్న యూజర్లు తమ ట్వీట్‌ను ఎడిట్ చేసుకునేందుకు ఇకపై 1 గంట సమయమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్ బ్లూ అకౌంట్ నుంచి మంగళవారం అఫీషియల్‌ ట్వీట్ వచ్చింది. బ్లూ టిక్ సబ్‌స్ర్కైబర్లకు సంబంధించిన ట్విటర్ సపోర్ట్ పేజీ ఈ మేరకు ఇప్పటికే అప్‌డేట్ అయ్యింది. ఒక గంట వరకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తోంది.

‘‘ ఎక్కువగా విజ్ఞప్తులు అందుతున్న ఈ ఫీచర్ అందిస్తున్నాం. పబ్లిష్ చేసిన ట్వీట్స్‌ను పరిమిత సంఖ్యలో ఎడిట్ చేసుకోవచ్చు. అప్‌డేట్స్, ఎవరినైనా ట్యాగ్ చేయడం లేదా అటాచ్ చేసిన మీడియా ఆర్డర్‌ను మార్చడం చేసుకోవచ్చు. అయితే ఎడిట్ ట్వీట్ ప్రస్తుతం ఒరిజినల్ ట్వీట్స్, కోట్ చేసిన ట్విట్స్‌కు వర్తిస్తుంది’’ అని పేర్కొంది. కాగా ఎడిట్ ట్వీట్ ఫీచర్‌ను గతేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. అప్పుడు 30 నిమిషాలు మాత్రమే ఎడిట్‌కు అవకాశం ఉండేది. కాగా ట్విటర్‌ కొత్త సీఈవో లిండా బాద్యతలు చేపట్టాక పలు కీలక మార్పులకు సిద్ధమయిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-07T20:15:02+05:30 IST