స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి: కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ABN , First Publish Date - 2023-05-01T23:17:28+05:30 IST
ఆసిఫాబాద్, మే 1: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని కలెక్టర్ హేమంత్ సహదేవ రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్డీవో రాజేశ్వర్‌తో కలిసి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆసిఫాబాద్, మే 1: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని కలెక్టర్ హేమంత్ సహదేవ రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్డీవో రాజేశ్వర్‌తో కలిసి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయపార్టీల నాయకులు, అధికారులతో కలిసి పనిచేయాలని తెలిపారు. బూత్‌స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఫారం6,7,8ద్వారా వచ్చిన దరఖాస్తులపై విచారణ జరుపుతున్నారని రాజకీయ పార్టీల నాయకులు సైతం బూత్ స్థాయి అధికారులకు సహకరిస్తూ స్పష్టమైన జాబితా రూపొందించడానికి కృషిచేయాలని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే బూత్‌స్థాయి అధికారికి, తహసీల్దార్ లకు తెలియజేయాలని తెలిపారు. అర్హత కలిగిన వారి పేర్లు ఖచ్చితంగా ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభ్యంతరాలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పనపై ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల డీటీ జితేంతర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.