TS NEWS: నిర్మల్ జిల్లాలో చిరుతపులి హల్‌చల్.. వణుకుతున్న జనం

ABN , First Publish Date - 2023-08-17T00:05:25+05:30 IST

నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో చిరుతపులి(Leopard) సంచరించింది. చిరుత కదలికలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

TS NEWS: నిర్మల్ జిల్లాలో చిరుతపులి హల్‌చల్.. వణుకుతున్న జనం

నిర్మల్ : నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో చిరుతపులి(Leopard) సంచరించింది. చిరుత కదలికలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పెట్ నుంచి బంగల్ పెట్ వెళ్లే దారిలో పంట పొలాల సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది. చిరుత పులి కనిపించడంతో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారానికి సంబంధించి వివరాలు సేకరించారు. గాంధీచౌక్, పాత బస్తీ, విశ్వనాథ్ పేట, బంగల్ పేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు దండోరా వేశారు.

పులి సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. చిరుత అడుగు జాడల ఆధారంగా అది ఎటువైపునకు వెళ్లిందనే దానిపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చిరుతను బంధించాలని ప్రజలు విన్నవించారు. చిరుత సంచారంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.

Updated Date - 2023-08-17T00:10:38+05:30 IST