ప్రజావాణి సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2023-06-27T00:31:34+05:30 IST
ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తులు పరి శీలించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి ఆదేశించారు.

నిర్మల్ కల్చరల్, జూన్ 26 : ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తులు పరి శీలించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి ఆదేశించారు. సోమ వారం నూతన కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి 38 దర ఖాస్తులను స్వీకరించారు. అన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌వో లోకేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.
పీజీ కళాశాలలో అన్ని కోర్సులను ప్రారంభించాలని కలెక్టర్‌కు వినతి
నిర్మల్ చైన్‌గేట్ : జిల్లా కేంద్రంలో ఉన్న పీజీ కళాశాలలో అన్ని కోర్సులను ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శీతల్కర్ అరవింద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పీజీ కళాశాలలో అన్ని కోర్సులను ప్రారంభించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ వరుణ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు అమ్ముతూ దోచుకుంటున్నారన్నారు. అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్స్, లెక్చలర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్స్, గురుకులాల విద్యార్థులకు కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతీవిద్యార్థికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలకు పక్కాభవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పక్కా భవనాలను నిర్మించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మామీ ఇచ్చారన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు నామత్కర్ నవీన్, ముథోల్ డివిజన్ కార్యదర్శి గడపాలే పరమేశ్వర్, నాయకులు అనిల్, వంశీ తదితరులున్నారు.