Amit Shah: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణకు అమిత్ షా

ABN , First Publish Date - 2023-04-23T10:02:00+05:30 IST

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా వస్తున్నారు.

Amit Shah: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణకు అమిత్ షా

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా వస్తున్నారు. 6 గంలకు చేవెళ్ల విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. ఆయన ప్రసంగంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాగా తెలంగాణ పర్యటనకు ముందు అమిత్ షా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

దక్షిణాదిలో కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో‌ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో‌ పార్లమెంట్ ప్రావాస్ యోజలో భాగంగా జరుగుతున్న చేవెళ్ల విజయ సంకల్ప సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 8న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. 15 రోజుల గ్యాప్‌లో తెలంగాణలో మోదీ, అమిత్ షా పర్యటనకు రావడం విశేషం.

అధికారిక కార్యక్రమంలో సైతం బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ కుటుంబ పాలనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ టార్గెట్ చేశారు. దీంతో చేవెళ్ల విజయసంకల్ప సభలో అమిత్ షా స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు అమిత్ షా చేవెళ్ల సభలో ఉండనున్నారు. సభ అనంతరం రోడ్డు మార్గాన రాత్రి 7:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-04-23T10:02:00+05:30 IST