Minister Talasani: చంద్రమోహన్ మృతి బాధాకరం...
ABN , First Publish Date - 2023-11-11T13:57:28+05:30 IST
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విభిన్నమైన పాత్రలలో తన విలక్షణ నటనతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని కొనియాడారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (Chandramohan) మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. విభిన్నమైన పాత్రలలో తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రేక్షకులకు తీరని లోటని అన్నారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరుతూ ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని మంత్రి తలసాని అన్నారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1943 మే, 23 జన్మించిన చంద్రమోహన్ 'రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 900లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. కామెడీ పాత్రల ద్వారానే ఆయన ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'ఆక్సిజన్' ఆయన నటించిన చివరి చిత్రం.