Kirankumar: బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
ABN , First Publish Date - 2023-07-21T15:19:22+05:30 IST
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Former Chief Minister Kirankumar Reddy)అన్నారు. రాష్ట్ర విభజన త్వరాత తెలంగాణలో మెదటసారి బహిరంగ సభలో మాజీ సీఎం మాట్లాడుతూ... ఈ సందర్భంగా అధికార బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ పార్టీపై (MIM) కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయమన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపేనీ, కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కలసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతులో ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కారు తాళాలు బీజేపీ తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి తన వంతు కృషి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.