Share News

Vivek Venkataswamy: పార్టీ మార్పు ప్రచారంపై వివేక్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-10-25T15:01:08+05:30 IST

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఖండించారు. హైదరాబాద్‌లో దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో

Vivek Venkataswamy: పార్టీ మార్పు ప్రచారంపై వివేక్ ఏమన్నారంటే..!

హైదరాబాద్: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఖండించారు. హైదరాబాద్‌లో దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ మార్పుపై ఆయన స్పందించారు. పార్టీ మారుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోందన్నారు. ఇందులో వాస్తవం లేదని తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయం తనకు తెలియదని వెల్లడించారు.

Updated Date - 2023-10-25T15:01:58+05:30 IST