Rajasingh: ‘బెదిరింపులకు భయపడేది లేదు... ప్రాణత్యాగానికైనా సిద్ధం’
ABN , First Publish Date - 2023-02-24T12:42:01+05:30 IST
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్‌లు చేశారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh)కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్‌లు చేశారు. అయితే బెదిరింపుల మెసేజ్ (Threatening message)పై రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు భయపడేది లేదని.. ధర్మం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు (Telangana People) ఆశీర్వాదం కావాలని గోషామహల్ ఎమ్మెల్యే తెలిపారు. బెదిరింపు కాల్స్, మెసేజ్‌లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన డీజీపీ (DGP) పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్స్ (BJP, Congress Leaders)మూవ్‌మెంట్ గురించి తెలుసుకోవటం కోసం ప్రభుత్వం (Telangana Government) కమాండ్ కంట్రోల్ రూం నిర్మించిందని తెలిపారు. ‘‘ఎమ్మెల్యేనైన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఎంఐఎం (MIM) ఒత్తిడి వలనే బెదిరింపు కాల్స్ (Threatening calls)పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాతబస్తీ (Old City)లో ఉగ్రవాదుల (Terrorists)కు ఎంఐఎం ఆర్థికసాయం చేస్తోందని ఆరోపించారు. టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తే.. ధర్నాలు చేసిన చరిత్ర ఎంఐఎంకు ఉందన్నారు. తనకు బెదిరింపు మెసేజ్‌లు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంపేస్తామంటూ నాలుగైదు రోజులుగా వరుస మెసేజ్‌లు వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు.
వరుసగా బెదిరింపు మెసేజ్‌లు..
కాగా.. రాజాసింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్‌లు చేశారు. చంపేస్తామంటూ వరుసగా వాట్సప్ మెసేజ్‌లు పెట్టారు. మూడు రోజుల క్రితం రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ రావడంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు సందేశాలు పంపారు. దీంతో పోలీసులకు మరోసారి రాజాసింగ్ ఫిర్యాదు చేయనున్నారు.