TS News: తెలంగాణ ప్రభుత్వ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-04-10T11:41:54+05:30 IST
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో తెలంగాణ పెండింగ్ బిల్లుల (Telangana Pending Bills) ఆమోదం పిటిషన్ (Petition)పై సోమవారం విచారణ జరగనుంది.
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో తెలంగాణ పెండింగ్ బిల్లుల (Telangana Pending Bills) ఆమోదం పిటిషన్ (Petition)పై సోమవారం విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (DY Chandrachud) ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) ఇవాళ మూడు బిల్లులను ఆమోదించారు. మరో రెండు బిల్లులను వెనక్కి పంపారు. రెండు బిల్లులను రాష్ట్రపతి (President) ఆమోదానికి పంపారు. మరో మూడు బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు.
ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు.. 1. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజు) (సవరణ) బిల్లు 2. తెలంగాణ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు 3. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (విశ్వాసం యొక్క వయస్సు నియంత్రణ) (సవరణ) బిల్లు 4. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు 5. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు 6. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు 7. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన, నియంత్రణ) (సవరణ) 8. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు 9. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు 10. తెలంగాణ మునిసిపాలిటీల నిబంధనల చట్ట (సవరణ) బిల్లు.