Kasani: తెలంగాణ రావడానికి మొదట ప్రతిపాదనలు ఇచ్చిందే చంద్రబాబు..

ABN , First Publish Date - 2023-06-02T13:41:41+05:30 IST

హైదరాబాద్: టీటీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.

Kasani: తెలంగాణ రావడానికి మొదట ప్రతిపాదనలు ఇచ్చిందే చంద్రబాబు..

హైదరాబాద్: టీటీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ (Telangana) ఆవిర్భావం ఒక చరిత్ర అని, తెలంగాణ రావడానికి.. ఇవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చిందే చంద్రబాబు నాయుడని (Chandrababu Naidu) అన్నారు. 60 సంవత్సరాల తర్వాత తెలంగాణ రావడం సంతోషమన్నారు. తెలంగాణ ప్రజలు, యువత.. కన్న తెలంగాణ మనకు రాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.

తెలంగాణ రాలేదని ఆనాడు యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేయాలో అది చేయలేదని కాసాని జ్ఞానేశ్వర్ విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కానీ.. పెద్ద స్థాయిలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారని అన్నారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు కానీ.. లీడర్ల దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు రావడం లేదని.. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాల్సిందేనని.. ఇలాంటి దుష్ట ప్రభుత్వం పోవాల్సిందేనని.. యువత ఆలోచించాల్సిన సమయం వచ్చిందని కాసాని జ్ఞానేశ్వర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-02T13:41:41+05:30 IST