Share News

Konda Visveshwara Reddy:‘తగ్లిబే జమాతే ఇస్తేమా’ సభ ప్రమాదకరం.. నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 21 , 2023 | 10:48 PM

పరిగిలో జరిగే ‘తగ్లిబే జమాతే ఇస్తేమా’ సభ నిర్వహణ ప్రమాదకరమని.. ఆ సభ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తెలిపారు.

Konda Visveshwara Reddy:‘తగ్లిబే జమాతే ఇస్తేమా’ సభ ప్రమాదకరం.. నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా: పరిగిలో జరిగే ‘తగ్లిబే జమాతే ఇస్తేమా’ సభ నిర్వహణ ప్రమాదకరమని.. ఆ సభ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘మూఢనమ్మకాలను ప్రచారం చేసే ఈ సంస్థ ...మూడేళ్ల క్రితం కరోనాను కూడా వ్యాప్తి చేసింది. తగ్లిబే జమాతే నిర్వహించే కార్యక్రమాలను చాలామంది ముస్లింలు కూడా నమ్మరు. ఈ సంస్థ కార్యకలాపాలను సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాలే రద్దు చేశాయని గుర్తు చేశారు. అలాంటి సంస్థను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహించడం బాధాకరం సెక్యులర్ దేశంలో ఓ వర్గాన్ని, ఓ మతాన్ని ప్రోత్సహించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు’’ అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

ఈ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలను ప్రొత్సహిస్తుంది

‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 7 కోట్లు ఇస్తామన్నది...ఈ ప్రభుత్వం 2.45 కోట్లు విడుదల చేసింది. 85 % ఉన్న హిందువులు నిర్వహించే కార్యక్రమాలకు ఎన్ని నిధులిస్తారు. ఈ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలను ప్రొత్సహిస్తుందని మాకు సమాచారం ఉంది. దేశ భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోరాడుతుంటే ఇలాంటి సంస్థలను ప్రొత్సహించడం సరికాదు. ఈ కార్యక్రమం ఆపే పరిస్థితి లేకపోతే కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పరిగి ప్రాంతానికి ఇస్తేమా సభ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది’’ అని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 21 , 2023 | 11:29 PM