Share News

Peddapalli Dist.: రామగుండం జెన్‌కో విద్యుత్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2023-10-25T07:32:27+05:30 IST

పెద్దపల్లి జిల్లా: రామగుండం 62 మెగా వాట్ల బి పవర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుండడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

Peddapalli Dist.: రామగుండం జెన్‌కో విద్యుత్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

పెద్దపల్లి జిల్లా: రామగుండం 62 మెగా వాట్ల బి పవర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుండడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నివారణ చర్యలు చేపట్టారు. కొంతమేర ఆస్తి నష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్లాంటులో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. కాగా అగ్ని ప్రమాదం సోమవారం అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-25T07:32:27+05:30 IST