సీహెచ్‌పీలో సబ్‌స్టేషన్ ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-27T00:12:51+05:30 IST
ఓసీపీ-3 సీహెచ్‌పీలో నూతనంగా నిర్మించిన క్రాస్ ఓవర్ బ్రిడ్జి, ఈస్ట్ సబ్‌స్టేషన్‌లను సింగరేణి డైరెక్టర్(ఆప రేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు.

యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 26: ఓసీపీ-3 సీహెచ్‌పీలో నూతనంగా నిర్మించిన క్రాస్ ఓవర్ బ్రిడ్జి, ఈస్ట్ సబ్‌స్టేషన్‌లను సింగరేణి డైరెక్టర్(ఆప రేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. సీహెచ్‌పీ ఆధునికీ కరణలో భాగంగా యాజమాన్యం 1.90 కోట్ల వ్యయతో క్రాస్ ఓవర్ బ్రిడ్జి, 3.41 కోట్లతో ఈస్ట్ సబ్‌స్టేషన్‌లను నిర్మించింది. క్రాస్‌ఓవర్ బ్రిడ్జి అందు బాటులోకి రావడంతో బొగ్గు రవాణాలో అంతరాయం కల్గకుండా, సివిల్ వాహనాలకు ఇబ్బందులు కల్గకుండా ప్రయాణించే అవకాశం ఉంటుం దని డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు బొగ్గు ఉత్పత్తికి 10 ఏళ్ళ పాటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈస్ట్ సబ్‌స్టేషన్ నిర్మా ణం చేయడం జరిగినట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆర్జీ-2 జీఎం మనోహర్ మాట్లాడారు. బ్రిడ్జి లేని కారణంగా బొగ్గు తరలించే డంపర్లు, రోడ్డుపై వెళ్లే వాహనాలను పర్యవేక్షించేందుకు ఒక్కో షిఫ్టులో నలుగురు ఉద్యోగులను కేటాయించాల్సి వచ్చేదని అన్నారు. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో రోడ్డుపై వెళ్ళే వాహనాలు సులభంగా వెళ్ళే అవ కాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ వెంక ట్రావ్, జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, అధికారుల సంఘం జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి, టీబీజీ కేఎస్ ఏరియా వైస్‌ప్రెసిడెంట్ అయిలి శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.