అభివృద్ధిలో కరీంనగర్‌ ముందంజ

ABN , First Publish Date - 2023-05-14T00:31:33+05:30 IST

స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి, సీఎం అస్యూరెన్సు, ఆర్థిక సంఘం, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ ఇతరత్రా నిధులతో కరీంనగర్‌ అభివృద్ధిలో గ్రేటర్‌ వరంగల్‌ కంటే కూడా ముందంజలో ఉంది. తొమ్మిదేళ్లలో గుర్తుపట్టలేని విధంగా అద్భుతమైన స్మార్ట్‌రోడ్లు, ఫుట్‌పాత్‌లు, జంక్షన్లు, ఓపెన్‌జిమ్స్‌, పార్కులు, తీగలవంతెన వంటి అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కరీంనగర్‌కు వచ్చిన వారంతా అభివృద్ధిని చూసి అబ్బురపడుతున్నారు’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

అభివృద్ధిలో కరీంనగర్‌ ముందంజ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు

- తొమ్మిదేళ్లలో గుర్తుపట్టలేనంతగా అభివృద్ధి

- 17వ డివిజన్‌లో కమ్యూనిటీ హాల్‌కు రూ. 20 లక్షలు

- రూ. మూడు కోట్లతో డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపడతాం

- మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 13: ‘స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి, సీఎం అస్యూరెన్సు, ఆర్థిక సంఘం, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ ఇతరత్రా నిధులతో కరీంనగర్‌ అభివృద్ధిలో గ్రేటర్‌ వరంగల్‌ కంటే కూడా ముందంజలో ఉంది. తొమ్మిదేళ్లలో గుర్తుపట్టలేని విధంగా అద్భుతమైన స్మార్ట్‌రోడ్లు, ఫుట్‌పాత్‌లు, జంక్షన్లు, ఓపెన్‌జిమ్స్‌, పార్కులు, తీగలవంతెన వంటి అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కరీంనగర్‌కు వచ్చిన వారంతా అభివృద్ధిని చూసి అబ్బురపడుతున్నారు’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ 17వ డివిజన్‌లో రూ. 50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్‌ కోల భాగ్యలక్ష్మిప్రశాంత్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శ్రీరాంనగర్‌కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కాలనీలోని రోడ్‌ నంబర్‌ 5,6,7,8,9లలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్‌, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాల్‌ నిర్మించి మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 17వ డివిజన్‌కు మూడు కోట్ల రూపాయలను కేటాయించామని, వాటితో రోడ్లు, డ్రైనేజీలు పూర్తవుతాయని, స్మార్ట్‌సిటీ రోడ్లు వేయిస్తామని, కమ్యూనిటీ హాల్‌కు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీరాంనగర్‌కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దనపునేని మాధవరావు, ప్రధాన కార్యదర్శి గజవాడ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు బల్మూరి విజయసింహారావు, కోశాధికారి టి నర్సింహాచారి, కార్యవర్గ సభ్యులు లక్ష్మన్‌రావు, బాలసంతుల జితేందర్‌రావు, పేరాల శంకరయ్య, సలహాదారుడు శరత్‌రావు, 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొండపల్లి సరిత సతీష్‌, కార్పొరేటర్లు దిండిగాల మహేశ్‌, ఏదుళ్ల రాజశేఖర్‌, నాంపల్లి శ్రీనివాస్‌, తోట రాములు, బీఆర్‌ఎస్‌ నాయకులు అర్ష మల్లేశం, కోల సంపత్‌, సుధగోని కృష్ణగౌడ్‌, గుగ్గిళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

స్వయం పాలనతో మారిన గ్రామాల రూపు రేఖలు

కరీంనగర్‌ రూరల్‌: స్వయం పాలనతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కొత్తపల్లి, కరీంనగర్‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి పట్టణ పరిధిలోని వెలిచాల క్రాస్‌ రోడ్డు వద్ద 4.4 కోట్లతో రోడ్డు డ్యాం, కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి నుంచి వెదురుగట్ట రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నింటికి సెంట్రల్‌ లైటింగ్‌తో అన్ని హంగులు తీర్చిదిద్దుతున్నామన్నారు. ఒద్యారం, శాతవాహనయూనివర్సిటీ, బొమ్మకల్‌ నుంచి మొగ్దుంపూర్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. కొత్తపల్లి నుంచి వెలిచాల రోడ్డు వరకు 5.5 లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు పనులను ఆగస్టు నెలలోగా పూర్తి చేస్తామన్నారు.

ఫ అన్నదాతకు అన్నదం పెట్టడం పూర్వజన్మ సుకృతం

అన్నదాతకు అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో రైతులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏఎంసీ పాలక వర్గం, మంత్రి గంగుల కమలాకర్‌ సొంత డబ్బులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు ఆకలితో ఉండవద్దనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రెడ్డవేణి మధు, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, జిల్లా గ్రంఽథాాలయ సంస్థ ఛైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఉప్పు రాజశేఖర్‌, డీఎంవో పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-14T00:31:33+05:30 IST