Share News

పదో తరగతి విద్యార్థులకు కార్పొరేట్‌ గాలం

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:13 AM

పది పరీక్షలు ఇంకా పూర్తికాలేదు... అప్పుడే కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థులకు చేర్పించేందుకు గాలం వేస్తున్నాయి... జిల్లా నుంచి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హైదరాబాద్‌లో చేర్పిస్తారు... దీంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు ఏజెంట్లను నియమిస్తున్నారు.. వారు పదో తరగతి విద్యార్థుల ఫోన్‌ నంబర్లను జాబితాను తీసుకొని తమ కళాశాలలో చేర్పించాలని ఫోన్లు చేస్తున్నారు... పరీక్షలు పూర్తికాక ముందే ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నారు...

పదో తరగతి విద్యార్థులకు   కార్పొరేట్‌ గాలం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రైవేట్‌ విద్య వ్యాపారంగా మారింది. తమ పిల్లలను కార్పొరేట్‌ కళాశాలల్లో చదివించాలనే తల్లితండ్రుల బలహీనతను యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటు న్నాయి. రంగు రంగుల బ్రోచర్లు ముద్రించి కమీషన్‌ ఏజెంట్లను నియమించుకుని ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ఆరంభానికి ఆరు మాసాల ముందు నుంచే ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థుల చిరునామాలు, తల్లితండ్రుల సెల్‌ ఫోన్‌ నంబర్లు సేకరించి ముందస్తు అడ్మిషన్ల కోసం మైండ్‌ వాష్‌ చేస్తున్నారు. ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు ఇస్తామని, పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రవేశాలు దొరకవంటూ తల్లితండ్రు లను కలిసి గాలం వేస్తున్నారు. ముందస్తుగా అడ్మిషన్లు చేయడం విరుద్ధమని తెలిసినా కూడా కార్పొరేట్‌ విద్యా సంస్థల యజమాన్యాలు యేటా అదే పద్ధతిని కొనసాగి స్తున్నాయి.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాం తం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌, వివిధ మండ లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 7393 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారి వివరాలు, తల్లితండ్రుల సెల్‌ ఫోన్‌ నంబర్లను నాలుగు మాసాల క్రితమే సేకరించి అడ్మిషన్ల కోసం తరచూ ఫోన్లు చేస్తూ ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో కార్పొరేట్‌ కళాశాలల ఆఫర్లకు లొంగిపోయి అడ్మిషన్లు చేస్తున్నారు. అడ్మిషన్ల కోసం తిరుగుతున్న ఏజెంట్లకు ఒక్కో అడ్మిషన్‌కు 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు కమీషన్లు ఇస్తున్నారు. అలాగే ఆయా కళాశాలల్లో విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులకు సైతం టార్గెట్లు పెట్టి అడ్మిషన్ల కోసం తిప్పుతున్నారు. వారికి వేతనాలతో పాటు కమీషన్లు కూడా ఇస్తున్నారు. దీంతో డబ్బులకు ఆశపడి ఏజెంట్లు విద్యార్థులను ఆయా కళాశాలల్లో చేర్చించేందుకు కసరత్తును మొదలుపెట్టారు. ప్రధానం గా హైదరాబాద్‌లో ఉండే కార్పొరేట్‌ కళాశాలలు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో గల ఆయా ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు ముందుస్తుగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ఇంటర్‌లో కోరిన బ్రాంచ్‌లో సీటు ఇప్పిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. పదో తరగతి ఫలి తాలు రాకముందే ఆడ్మిషన్‌ తీసుకుంటే తక్కువ ఫీజు ఉంటుందని ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయని నమ్మ బలుకుతున్నారు. జిల్లాలో ఇప్పటికే చాలా మంది విద్యా ర్థులు చాలా కళాశాలల్లో అడ్మిషన్లు పాందినట్టు సమా చారం. అడ్మిషన్‌ తీసుకునే వరకు కమీషన్‌ ఏజెంట్లు విద్యార్థుల తల్లితండ్రులను కాకా పడుతున్నారు.

నాలుగు మాసాల నుంచి ఫోన్లు..

పైవ్రేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నాలుగు మాసాల నుంచి ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారు. ఎవరైన తల్లిదండ్రులు పరీక్షల ఫలితాలు రాక ముందే ఎలా చేర్పించాలని ప్రశ్నిస్తే మీ పిల్లలు బాగానే చదువుతారని తమకు సమాచారం ఉందని, మా కళశాలలో చేర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఊదర గొడుతున్నారు. ఒక్కోసారి కళాశాలల యాజమానులతో తల్లితండ్రులకు మాట్లాడి స్తున్నారు. పదో తరగతి ఫలితాలతో సంబంధం లేకుం డా తాము చేర్చించుకుంటామని, ఒకవేళ పాస్‌ కాకపోతే చెల్లించిన డబ్బులు తిరిగి ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ముందుగానే సీటు రిజర్వు చేసుకోకపోతే ఆ తర్వాత కోరిన బ్రాంచ్‌ దొరకదని ఆందోళనకు గురి చేస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచన చేయాలి..

ఇంటర్‌ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకునే ముందు విద్యిర్థుల భవిష్యుత్తు గురించి తల్లితండ్రులు ఆలోచన చేయాలి. పదో తరగతి పరీక్షల సమయంలోనే కార్పొరేట్‌ కళాశాలల ఏజెంట్లు అడ్మిషన్లు తీసుకునే వరకు వెంట బడుతుంటారు. మరో 10 రోజుల్లో ఫలితాలు వసా ్తయని, ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోవాలని తల్లితండ్రులను విసిగిస్తుంటారు. వారి బాధ భరించలేక ఏ కళాశాల అయితే ఏమపుతుందిలే అని అడ్మిషన్లు తీసుకుంటే చేతులారా తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన వాళ్లు అవుతారు.. ఒకసారి కాలేజీల్లో చేరితే తర్వాత ఎవరూ పట్టించుకోరు. యేటా ఏజెంట్లు అడ్మిషన్‌ చేయించడం ఆ తర్వాత వారు వెళ్లిపోవడం షరా మామూలుగా జరుగుతున్నది. కార్పొరేట్‌ కళాశాలలో చేర్పించే ముందు విద్యార్థుల అభిప్రాయాలతో పాటు కళాశాలలో విద్య నాణ్యత, బోధన చేస్తున్న వారి అను భవం, ఆ కళాశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థులు, పూర్వ విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. హాస్టల్‌లో ఉంచినట్లయితే పనతులపై ఆరా తీసిన తర్వాతనే అడ్మిషన్‌ తీసుకోవాలి. తమ విద్యా వ్యాపారం కోసం మసి పూసి మారేడు కాయ చేస్తున్న కళాశాలలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కళాశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తే విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురై మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లేకపోలేదు. కార్పొ రేట్‌ కళాశాలల ఏజెంట్ల మాయలో పడి తమ పిల్లల భవిష్యత్తును అగాధంలోకి నెట్టి వేయకుండా తల్లితం డ్రులు ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Mar 26 , 2025 | 12:13 AM