పటిష్టమైన నిఘాతో గంజాయిని నియంత్రించాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:10 AM
పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయిని నియంత్రించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గంజాయి రవాణా, సేవించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మంగళ వారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ అధికారి చట్టబ ద్ధంగా పని చేయాలన్నారు.

కోల్‌సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయిని నియంత్రించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గంజాయి రవాణా, సేవించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మంగళ వారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ అధికారి చట్టబ ద్ధంగా పని చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యకలాపాలపై సేషన్ అధికా రులకు ముందస్తు సమాచారాలు ఉండాలని, ప్రతి కేసులోను సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగించుకోవాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. తద్వారా నేరాలను నియంత్రించవచ్చని ఆయన సూచించారు. దొంగతనాల నివారణకు నిరం తరం పెట్రోలింగ్ చేయాలన్నారు.
సంఘటన స్థలానికి అధికారులు తప్పనిసరిగా వెళ్లాలని, అప్పుడే క్షేత్రస్థాయిలో సమాచారం లభిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విలేజీ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంజాయి స్వాధీనం కేసుల్లో ప్రతిభకనబరిచిన అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు. డీసీపీలు కరుణాకర్, భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖనీ ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏసీపీలు మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు, వివిధశాఖల సిబ్బంది పాల్గొన్నారు.