Jupalli Krishna Rao: ఆమె రుణం తీర్చుకోక పోతే దేవుడు కూడా క్షమించడు

ABN , First Publish Date - 2023-06-26T18:14:55+05:30 IST

బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడోసారి పరిపాలించే నైతిక హక్కు కోల్పోయింది అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌వి అన్ని బోగస్ మాటలు అని మండిపడ్డారు. కేసీఆర్ పరిపాలన చూశాక ప్రజలకు అంతా అర్థమైందని చెప్పుకొచ్చారు. సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు వచ్చి అవకాశం వచ్చిందని.. ఇది అందరి బాధ్యత అని గుర్తుచేశారు.

Jupalli Krishna Rao: ఆమె రుణం తీర్చుకోక పోతే దేవుడు కూడా క్షమించడు

ఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడోసారి పరిపాలించే నైతిక హక్కు కోల్పోయింది అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ(Rahul gandhi)తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌వి అన్ని బోగస్ మాటలు అని మండిపడ్డారు. కేసీఆర్ పరిపాలన చూశాక ప్రజలకు అంతా అర్థమైందని చెప్పుకొచ్చారు. సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు వచ్చి అవకాశం వచ్చిందని.. ఇది అందరి బాధ్యత అని గుర్తుచేశారు. కేసీఆర్ మాటలు నమ్మొద్దని కోరారు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని ప్రజలకు జూపల్లి విజ్ఞప్తి చేశారు.

9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి పోయిందని.. అవినీతి ఆకాశానికి అంటిందని విమర్శించారు. నూటికి నూరు శాతం ప్రజలను మోసం చేసే దుర్మార్గ పాలన కేసీఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. సోనియా రుణం తీర్చుకోక పోతే దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్యానించారు. వచ్చే నెల 14 లేదా 16వ తేదీల్లో మహబూబ్‌నగర్‌‌లో జరిగే సభలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు జూపల్లి స్పష్టం చేశారు.

KDLD.jpg

Updated Date - 2023-06-26T18:31:47+05:30 IST