మున్నూరు కాపు విద్యావసతి గృహానికి సహకరిస్తా
ABN , First Publish Date - 2023-05-25T23:59:50+05:30 IST
మున్నూరు కాపు విద్యా వసతి గృహానికి సహకారం అందిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

వనపర్తి అర్బన్, మే 25: మున్నూరు కాపు విద్యా వసతి గృహానికి సహకారం అందిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని బండారు నగర్‌లో మున్నూరు కాపు కామన్ హాల్, బ్యాంకెట్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పేద విద్యార్థులకు చేయూతనిచ్చినప్పుడే వారిలోని ప్రతిభను నిరూపించుకోగలుగుతారన్నారు. సివిల్స్ ర్యాంకులు సాధిస్తున్న వారిలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పేదలపిల్లలు 90శాతం మంది ఉంటున్నార న్నారు. సామాన్యులకు సహకారం అందిస్తే ఉన్నతస్థాయికి చేరుకుంటారనడా నికి ఇదే నిదర్శనం అన్నారు. తన వంతుగా రూ.20లక్షల విద్యా వసతి గృహానికి సహాయం చేస్తానని, అలాగే ఐదు గుంటల స్థలం కేటాయించేలా కృషి చేస్తానన్నారు. చదువుకునే విద్యార్థులకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉం టుందన్నారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులు , మహిళలు పాల్గొన్నారు.