ఆద్యంతం అట్టహాసం
ABN , First Publish Date - 2023-10-03T00:59:24+05:30 IST
నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ హబ్ అట్టహాసం మధ్య ప్రారంభమయ్యాయి.

నల్లగొండలో మంత్రి కేటీఆర్ పర్యటన
రూ.90 కోట్ల ఐటీ హబ్ ప్రారంభం
రూ.912.33 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్లగొండ టౌన, అక్టోబరు 2: నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ హబ్ అట్టహాసం మధ్య ప్రారంభమయ్యాయి. రూ.912.33 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రులు కేటీఆర్, జగదీ్‌షరెడ్డిలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణనతో కలిసి ప్రారంభించారు. ఐటీ టవర్ లోపల పూజల అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన శిలాఫలాకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
అన్నెపర్తి నుంచి నల్లగొండకు...
అన్నెపర్తిలోని 12వ బెటాలియనకు హెలికాప్టర్‌లో చేరుకున్న కేటీఆర్ రోడ్డు మార్గంలో నల్లగొండకు బయలుదేరారు. మర్రిగూడ బైపా్‌సలో రూ.45కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. రూ.146.60కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాతలను ప్రారంభించారు. రైల్వేట్రాక్ వద్ద ఏర్పాటుచేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేనేత మరమగ్గాల పథకం కింద గట్టుప్పల్, తేరటిపల్లి వాసులకు మగ్గాల పంపిణీ చేసి చేనేత కళాకారుల మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. సభ అనంతరం క్లాక్‌టవర్ సెంటర్‌లో వివిధ కళాభారతి, ఉదయసముద్రం ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు, విలీనగ్రామాల అభివృద్ధి, వాటర్‌సప్లయి ఇంప్రూమెంట్ పనులు యూజీడీ పను లు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, వేర్ హౌజింగ్ కమర్షియల్‌కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధిం చిన శిళాఫలకాలకు శంకుస్థాపనచేశారు. వర్చువల్‌గా సుభాష్ చంద్రబోస్, అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించారు.