Cantonment Board Elections: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు

ABN , First Publish Date - 2023-03-17T17:12:31+05:30 IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు (Cantonment Board Elections) రద్దు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్లలో

Cantonment Board Elections: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు (Cantonment Board Elections) రద్దు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్లలో ఎన్నికలను కేంద్రం రద్దు చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుతో సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30 న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజా కేంద్రప్రభుత్వ (Central Govt) నిర్ణయంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌లో మొత్తం 8 వార్డులున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పాలక మండలికి 2015లో ఎన్నికలు జరిగాయి. 8 వార్డులకు గాను ఎన్నికైన 8 మంది సభ్యులు తమలో ఒకరిని బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2015 ఫిబ్రవరిలో పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మిలిటరీకి చెందిన ఆంధ్రా, తెలంగాణ (Andhra Telangana) సబ్‌ ఏరియా కమాండర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే, రక్షణ శాఖ ఎన్నికలు జరుపలేదు.

అదే పాలక మండలిని ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మరో ఆరు నెలల పాటు పాలక మండలి పదవీకాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా 2021 ఫిబ్రవరి వరకు పాత పాలక మండలే కొనసాగింది. కంటోన్మెంట్‌కు ఎన్నికల జరుపకుండా రక్షణ శాఖ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ దాదాపు 9 నెలల పాటు మౌనం వహించింది. 2021 నవంబర్‌ (November)లో ఇతర కంటోన్మెంట్లతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు కూడా సివిల్‌ నామినేటెడ్‌ సభ్యుడిని నియమించారు. 2022 ఫిబ్రవరిలో మరోసారి నామినేటెడ్‌ సభ్యుడి పదవీకాలాన్ని పొడిగించారు. కంటోన్మెంట్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. తిరిగి 2022 ఆగస్టులో మరోసారి నామినేటెడ్‌ సభ్యుడి పదవీ కాలాన్ని పొడిగించారు.

Updated Date - 2023-03-17T17:12:31+05:30 IST