Chandrababu: అరుదైన ఘటన..1995లో వెంకటేశ్వరరావు, 2024లో పురంధేశ్వరి!
ABN , Publish Date - Jun 11 , 2024 | 01:53 PM
కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29 ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభ పక్ష సమావేశం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బలపరిచారు.
అమరావతి: కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29 ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభ పక్ష సమావేశం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బలపరిచారు. 95 నాటి పరిణామాలను మరోసారి టీడీపీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు.
ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో అంతకు ముందు కూడా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో కూటమి పార్టీలు అంతా సమానమేననే సంకేతాలను చంద్రబాబు ఇవ్వడం జరిగింది. సిబ్బంది తన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీని తొలగించి అందరితో సమానమైన కుర్చీ తీసుకు రమ్మని చంద్రబాబు చెప్పారు. కూటమి అధినేతలు కూర్చున్నటువంటి కుర్చీనే తెప్పించుకొని అందరితో కలిసి చంద్రబాబు కూర్చొన్నారు. కూటమి పార్టీలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే స్ఫూర్తి తో పనిచేయాలని తన చర్యలు ద్వారా సందేశం పంపారు. ఇది మంచి పరిణామం అంటూ కూటమి నేతలు చర్చించుకున్నారు.