వైసీపీకి బిగ్ షాక్
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:12 AM
రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. నిన్నటి వరకు వైసీపీలో కీలకంగా ఉన్న ఈడిగ కుటుంబాలు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.

టీడీపీలో 500 కుటుంబాల చేరిక
రాయదుర్గంరూరల్, ఏప్రిల్ 13: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. నిన్నటి వరకు వైసీపీలో కీలకంగా ఉన్న ఈడిగ కుటుంబాలు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీ నాయకులైన గురుప్రసాద్, సాయిప్రకాష్, అరవింద్, రంగనాథ్, గోపి, సురే్‌షబాబు, రంజితకుమార్, రాకేష్, రామాంజినేయులు, సిద్ధప్ప, గురుస్వామి, ఏకాంతప్ప ఆధ్వర్యంలో ఈడిగ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాలవ విజయమే లక్ష్యం: కాలవ శ్రీనివాసులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి విజయమ్మ పట్టణంలోని 11, 12 వార్డులలో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాయదుర్గం ప్రజలు టీడీపీ పార్టీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ప్రశాంతి, మాజీ కౌన్సిలర్ బండి భారతి, పొరాళు పురుషోత్తం, కడ్డిపూడి మహబూబ్‌బాషా, నాగరాజు, బండి కృష్ణమూర్తి, సంపతకుమారి, పూజారి శివ పాల్గొన్నారు.
కాలవను గెలిపించండి: రాయదుర్గం ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే కాలవ శ్రీనివాసులును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కాలవ భరత కోరారు. శనివారం మండలంలోని వడ్రవన్నూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అప్పలాపురం ఆంజనేయస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన ఇనచార్జి మంజునాథగౌడ్, కాటా వెంకటేశులు, కన్వీనర్ హనుమంతు, సర్పంచులు అశోక్, రాజశేఖర్‌రెడ్డి, మల్లేశప్పపాల్గొన్నారు.