Share News

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..

ABN , Publish Date - Aug 15 , 2024 | 06:04 PM

ప్రజాసేవ పేరుతో చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు.. కానీ కొందరు మాత్రమే నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమవుతారు. మరికొందరు ప్రజాసేవ ముసుగులో తమ స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం నిజమైన ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..
MS Raju

ప్రజాసేవ పేరుతో చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు.. కానీ కొందరు మాత్రమే నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమవుతారు. మరికొందరు ప్రజాసేవ ముసుగులో తమ స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం నిజమైన ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను పొందిన మొదటి నెల జీతాన్ని నియోజకవర్గం ప్రజల కోసం ఖర్చు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే కేవలం ప్రభుత్వ నిధులతోనే సాధ్యంకాదని గ్రహించి.. తాము ప్రభుత్వం నుంచి తీసుకున్న మొదటినెల జీతాన్ని ప్రజల సంక్షేమం, నియోజకవర్గం అభివృద్ధి కోసం అందజేశారు. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ మొదటి నెల జీతాన్ని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. తమ నెల జీతాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పటినుంచి ఎమ్మెల్యేలంతా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకువెళ్తున్నారు. అనవసర ఖర్చులు చేయకుండా.. తమ జీతాన్ని సైతం అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చుచేస్తూ నిజమైన ప్రజాసేవకులమని నిరూపించుకుంటున్నారు. వీరిలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒకరు.

Chandrababu: అన్నా క్యాంటిన్ శాశ్వతంగా కొనసాగించాలి.. ఇదే నా ఆకాంక్ష


మున్సిపాల్టీకి..

మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు తన మొదటి నెల జీతం రూ.1,75,000ను మడకశిర మున్సిపాల్టీకి విరాళంగా అందజేశారు. ఈ డబ్బులతో మున్సిపాల్టీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా నీటి కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తన సతీమణితో కలిసి రూ.1,75,000 చెక్కును మున్సిపాల్టీ అధికారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అందించారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో తన మొదటి నెల జీతాన్ని మున్సిపాల్టీకి విరాళంగా అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని


అదేబాటలో మరికొందరు..

మడకశిర ఎమ్మెల్యే బాటలోనే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ మొదటినెల జీతాన్ని విరాళంగా అందిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు 164 మంది గెలవగా వీరిలో 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 21మంది జనసేన ఎమ్మెల్యేలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎమ్మెల్యేగా తాము అందుకున్న మొదటి నెల జీతాన్ని నియోజకవర్గం అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. మరికొంతమంది సైతం తమ మొదటినెల జీతాన్ని నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చుచేయనున్నట్లు తెలుస్తోంది.


Pawan kalyan: ఆద్యతో పవన్ సెల్ఫీ.. నెట్టింట పెద్ద ఎత్తున వైరల్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 15 , 2024 | 06:04 PM