సంక్రాంతి పండుగ సందడి
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:03 AM
సంక్రాంతి పండుగ సందడి జోరుగా కనిపిస్తోంది. ఆదివారం నుంచి భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడురోజల పాటు జరుపుకునేం దుకు పట్టణా లతో పాటు మండ లాల్లోని గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు.

హిందూపురం, పెనుకొండలో జోరుగా విక్రయాలు
హిందూపురం అర్బన/పెనుకొండ /పావగడ, జనవరి 13: సంక్రాంతి పండుగ సందడి జోరుగా కనిపిస్తోంది. ఆదివారం నుంచి భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడురోజల పాటు జరుపుకునేం దుకు పట్టణా లతో పాటు మండ లాల్లోని గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా హిందూపురం, పెనుకొండ పట్టణాల్లోని వ్యాపారులు పండుగకు అవసరమైన సరుకులతో విక్రయానికి సిద్ధంగా ఉన్నారు. రం గులు, చెరుకుగడలు, పండ్లు, పూలు, గుమ్మడి కాయలు, అనుపకా యల, శనక్కాయలు, కాయగూరల వ్యాపారాలతో ఆయా పట్టణాలతో పండుగ సందడి నెలకొంది. శనివారం కొనుగోలు దారులతో పట్టణాల ప్రధాన వీధులు కిటకిటలాడాయి. అయితే ధరలు ఆకాశాన్నంటాయి. ముగ్గులను అలంకరించేందుకు రంగుల కొనుగోలుపై మగువలు మొగ్గు చూపారు. అలాగే కర్ణాటకలోని పావగడ పట్టణంలో పండుగ సందడి నెలకొంది. కొనుగోలు దారులతో పట్టణం కిటకిటలాడింది.