Share News

వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:59 AM

నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నా యి. తాజాగా 1129 దళిత కుటుంబాలు శుక్రవారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలో చేరాయి. దళితగర్జన పేరుతో రాయదుర్గంలో శుక్రవారం టీడీపీ ఓ సభ నిర్వహించింది. తొలుత మొలకాల్మూరురోడ్డులో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కాలవ శ్రీనివాసులుతో పాటు ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, జనసేన నియోజకవర్గ ఇనచార్జ్‌ మంజునాథ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వైసీపీకి షాక్‌

1129 దళిత కుటుంబాలు టీడీపీలో చేరిక

మాజీ మంత్రి కాలవ

ఆధ్వర్యంలో దళితగర్జన

రాయదుర్గం, ఫిబ్రవరి 16: నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నా యి. తాజాగా 1129 దళిత కుటుంబాలు శుక్రవారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలో చేరాయి. దళితగర్జన పేరుతో రాయదుర్గంలో శుక్రవారం టీడీపీ ఓ సభ నిర్వహించింది. తొలుత మొలకాల్మూరురోడ్డులో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కాలవ శ్రీనివాసులుతో పాటు ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, జనసేన నియోజకవర్గ ఇనచార్జ్‌ మంజునాథ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత రం దళితగర్జన కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీగా షాదీమహల్‌ వరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న ఎన్నిక ల్లో జగనమోహనరెడ్డిని ఘోరంగా ఓడిస్తేనే అంబేడ్కర్‌ రాజ్యాంగ ధర్మాలను, విలువలను రక్షించుకోగలమన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఒకే రోజు పెద్ద సంఖ్యలో దళితులు చేరడం రాష్ట్ర రికార్డుగా భావిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన కూటమిలో పని చేయడానికి రాయదుర్గం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దళితులు టీడీపీలో చేరడం శుభపరిణామమన్నారు. బడుగు, బలహీన వర్గాల అండతో రాబోయే సాధారణ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో తాను 50 వేల మెజార్టీతో గెలుస్తాననే దృఢమైన నమ్మకం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి 165 స్థానాలకు తగ్గకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని వివరించారు. 27 దళిత సంక్షేమ పథకాలను అన్యాయంగా జగనరెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 17 , 2024 | 12:59 AM