Baby Missing : శిశువు మిస్సింగ్ కలకలం
ABN , Publish Date - Jul 29 , 2024 | 12:03 AM
మంచిగా మాట్లాడి సర్వజనాస్పత్రి నుంచి ఓ పాపను ఎత్తుకెళ్లిన ఆమని అనే మహిళ పోలీసులకు చిక్కింది. తన స్నేహితు రాలి కుమార్తె జిల్లా కేంద్రంలోని ప్రభుత సర్వజన ఆస్పత్రిలో కాన్పు కావడంతో ఆమెను చూడటానికి బాలింత తల్లితో పాటు వచ్చింది. రాత్రికి అక్కడే బాలింతకు తోడుగా పడుకుంది. స్నేహితురాలి కుమార్తెకు ఆరాత్రి ఎన్నో నీతులు చెప్పింది. చివరకు తెల్లవారుజామున పక్కన ఉన్న మరో బాలింత బిడ్డను ...
జిల్లా ఆస్పత్రిలో సంఘటన
స్నహితురాలి బిడ్డను చూసేందుకు వచ్చి మరొకరి శిశువును ఎత్తుకెళ్లిన మహిళ
సీసీ ఫుటేజీలో నిందితురాలి గుర్తింపు
బిడ్డను తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
మంచిగా మాట్లాడి సర్వజనాస్పత్రి నుంచి ఓ పాపను ఎత్తుకెళ్లిన ఆమని అనే మహిళ పోలీసులకు చిక్కింది. తన స్నేహితు రాలి కుమార్తె జిల్లా కేంద్రంలోని ప్రభుత సర్వజన ఆస్పత్రిలో కాన్పు కావడంతో ఆమెను చూడటానికి బాలింత తల్లితో పాటు వచ్చింది. రాత్రికి అక్కడే బాలింతకు తోడుగా పడుకుంది. స్నేహితురాలి కుమార్తెకు ఆరాత్రి ఎన్నో నీతులు చెప్పింది. చివరకు తెల్లవారుజామున పక్కన ఉన్న మరో బాలింత బిడ్డను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లింది. ఐదు రోజుల పసికందు అదృశ్యమైన ఘటన ఆదివారం జిల్లా ఆస్పత్రిలో తీవ్రకలకలం సృష్టించింది. పోలీసులు రంగంలోకి దిగి మూడుగంటలలో ఈపాప అదృశ్యం కేసును చేదించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అనంతపురం టౌన, జూలై 28: జిల్లా సర్వజనాస్పత్రిలో ఐదు రోజుల పసికందు అదృశ్యమైన సంఘటన ఆదివారం కలకలం రేపింది. పోలీసులు మూడు గంటల్లోను కేసును ఛేదించి, బిడ్డను తల్లి ఒడికి చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన అమృత ప్రసవం కోసం ఈనెల 23న అనంత జిల్లా ఆస్పత్రికి వచ్చిం ది. ఆమె అదే రోజు ఆడ శిశువును ప్రసవించింది. తొలి మూడురోజులు ఐసీయూలో ఉంచి రెండు రోజుల కిందట సాధారణ లేబర్‌వార్డుకు మార్చారు. అయితే ఆదివారం తెల్లవారుజామున పసిపాప కనబడకుండా పోయింది. దీంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. వెంటనే వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం వెళ్లింది. డీఎస్పీ ప్రతాప్, సీఐలు క్రాంతికుమార్, ప్రతా్‌పరెడ్డి తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో ఉన్న సీసీపుటేజీని పరిశీలించారు. అందులో పాపను ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించారు.
అన్నం తెచ్చిన సంచిలోనే ...
ఆమని అనంతపురం రూరల్ మండలం నారాయణపురంలో ఉంటున్నారు. ఇంటిపక్కనే ఉంటున్న తన స్నేహితురాలి కుమార్తె శ్రుతి ఆస్పత్రిలో డెలివరీ కావడంతో ఆమెను చూసేందుకు శనివారం వచ్చింది. భోజనం క్యారియర్‌తో పాటు ఓ సంచి కూడా తీసుకువచ్చింది. రాత్రి బాలింతతో పాటు ఆమె తల్లి, ఆమని కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ అన్నం తిన్నారు. అదే సమయంలోనే పక్క బెడ్‌పై ఉన్న నాగలూరుకు చెంది న బాలింత అమృత, ఆమె తల్లితో ఆ మని పరిచయం పెంచుకుంది. ఇంతకుముందే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మళ్లీ కుమార్తె పుట్టిందని అమృత తల్లి శకుంతల ఆమని వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈక్రమంలో ఆమని తెల్లవారుజామున మూడుగంటల సమయం లో అందరూ నిద్రిస్తుండగా అమృతకు పుట్టిన శిశువును క్యారియర్ తెచ్చిన సంచి లో ఉంచుకొని ఎత్తుకెళ్లింది. ఆస్పత్రినుంచి నేరుగా నారాయణపురంలో ఉన్న స్నేహితురాలి బంధువు ఇంటికి వెళ్లి అక్కడ ఆ పాపను ఉంచింది. ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి ఆస్పత్రికి చేరుకొంది. అయితే సీసీ పుటేజీలో ఆమ ని ఓ సంచి తీసుకెళ్లడం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో నారాయణపురం గ్రామంలోని తమ ఇంటిలో పసిపాపను ఉంచినట్లు ఆ ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ, సీఐలు అక్కడకు వెళ్లి ఆ చిన్నారిని తీసుకొచ్చి, తల్లికి అప్పగించారు. ఆ పాపను ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
నలుగురిపై వేటు
ఆస్పత్రిలో పాప మిస్సింగ్ వ్యవహారంలో నలుగురిపై వేటు పడింది. వార్డులో రాత్రిడ్యూటీలో ఉన్న ఇద్దరు స్టాఫ్‌నర్సులు శ్రవణమ్మ, సువర్ణమ్మలను సస్పెండ్ చేశారు. ఎఫ్‌ఎనఓ సుజాత, మహిళా సెక్యూరిటీ గార్డు సునీతను విధుల్లో నుంచి తొలగించినట్లు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు.
నాలుగున్నరప్పుడు చూసుకున్నా: అమృత, పాప తల్లి
ఆమని అనే ఆమె శనివారం రాత్రి మాతోనే ఉంది. మా మంచం మధ్యలోనే వారు పడుకున్నారు. మాపాప అర్ధరాత్రి వరకు ఏడుస్తూ ఉండగా నేను మేల్కొని ఉన్నా. పాపకు కడుపు నొప్పేమోనని చుక్కలు వేశాను. ఆతర్వాత పడుకున్నా. తిరిగి నాలుగున్నర సమయంలో మెలకువ రాగా చూస్తే పక్కన పాప కనిపించలేదు. లేచి మా అమ్మకు చెప్పా. ఎవరో ఎత్తుకెళ్లారని తెలుసుకొని ఇంటికి ఫోనచేశా. పోలీసులు నాబిడ్డను వెతికి నాకు అప్పగించారు. ఆనందంగా ఉంది.
అలా చేస్తాదని ఎలా అనుకుంటాం: శ్రుతి పక్కనే ఉన్న మరోబాలింత
ఆమని అనే ఆమె మాకు దాదాపు 12ఏళ్లుగా పరిచయం. మాఇళ్లవద్దనే ఉండటంతో మా అమ్మవాళ్లతో పాటు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఆ పరిచయంతోనే నన్ను చూడడానికి ఆస్పత్రికి వచ్చిందనుకున్నాం. అన్నం కూడా కలిసే తిన్నాం. ఇలా బిడ్డను ఎత్తుకెళుతుందని అ నుకోలేదు. ఆమెకు ఇప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇలా ఎందుకు చేసిందో నాకే అర్థంకావడంలేదు
రాత్రంతా వార్డులో తిరుగుతూ ఉంది: షాను, పక్కవార్డులో ఉన్న మరో బాలింత తల్లి
పాపను ఎత్తుకెళ్లిన ఆమని అనే ఆమె రాత్రంతా బాలింతల వార్డులో తిరుగుతూ కనిపించింది. పక్కనే ఉన్న మావార్డుకు వచ్చి నా కూతురుకు పుట్టిన బిడ్డ వద్దకు వచ్చి ఎంత ముద్దుగా ఉం దో ఆడపాప, మగబిడ్డ అని అడిగింది. మగబిడ్డ అని చెప్పగా ఆడబిడ్డ అయితే నేను ఎత్తుకెళ్లేదాన్ని అనింది. ఏదో తమాషాగా అంటోందని అనుకున్నా. కానీ అన్నంత పనిచేసింది. ఇలాంటోళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....