AP Police: తప్పుచేసిన అధికారుల్లో దడపుట్టిస్తున్న ఎస్పీ గౌతమి శాలి
ABN , Publish Date - May 26 , 2024 | 03:13 PM
అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలి నియమితులయిన తర్వాత జిల్లాలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఆమె బాధ్యలు స్వీకరించిన తర్వాత తప్పుచేసిన అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు దీనిలో భాగంగానే అధికార వైసీపీకి అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్ అంటకాగుతున్నారనే ఆరోపణలు రావడంతో ఎస్పీ గౌతమి అతనిపై చర్యలకు ఆదేశించారు. చర్యల్లో భాగంగానే జాకీర్ హుస్సేన్‌ను రాష్ట్ర పోలీస్ డీజీ కార్యాలయంలో సరెండర్ కావాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు.
అనంతపురం: అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలి (Gowthami Sali) నియమితులయిన తర్వాత జిల్లాలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఆమె బాధ్యలు స్వీకరించిన తర్వాత తప్పుచేసిన అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు దీనిలో భాగంగానే అధికార వైసీపీకి (YSRCP) అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్ అంటకాగుతున్నారనే ఆరోపణలు రావడంతో ఎస్పీ గౌతమి అతనిపై చర్యలకు ఆదేశించారు. చర్యల్లో భాగంగానే జాకీర్ హుస్సేన్‌ను రాష్ట్ర పోలీస్ డీజీ కార్యాలయంలో సరెండర్ కావాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు.
జాకీర్ హుస్సేన్ పదేళ్లకు పైగా అనంతపురంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వహించారు. అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని జాకీర్ హుస్సేన్‌పై పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు జాకీర్ హుస్సేన్‌పై టీడీపీ నేతలు కూడా పలుమార్లు పోలీస్ హై కమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ఉన్నత స్థాయి యంత్రాగం సీరియస్‌గా ఉంది.
జాకీర్ హుస్సేన్ టూ టౌన్ సీఐగా పనిచేస్తున్నప్పుడు కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఆర్యవైశ్య వృద్ధులను బెదిరించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం కూడా పోలీస్ హై కమాండ్‌కు తెలియడంపై అతనిపై చర్యలకు ఆదేశించింది. బళ్లారికి చెందిన ఆర్యవైశ్యుల భూమిని కబ్జా చేయడానికి యత్నించిన వైసీపీ నేతకు జాకీర్ హుస్సేన్ వంత పాడారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల ఒత్తిడితో భూ యజమానుల బంధువులపై ఆయన అక్రమ కేసులు పెట్టినట్లు ఎస్పీ గౌతమిశాలికి బళ్లారికి చెందిన సత్యనారాయణ శెట్టి ఫిర్యాదు చేశారు. ఈ కేసులు కూడా హై కమాండ్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. అతనిపై పోలీస్ ఉన్నత స్థాయి యంత్రాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
ఈ వార్తలు కూడా చదవండి
AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు
AP News: ఆయన ఆరోపణలు వాస్తవం కాదు.. లీగల్ నోటిసులు పంపిస్తాం.. సీఎస్ కార్యాలయం ప్రకటన
AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు
AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!
Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!
AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా
AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!
Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!
AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and Telugu News