VINAYAKA FESTIVAL : వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి
ABN , Publish Date - Sep 04 , 2024 | 12:05 AM
వినాయకచవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఆర్డీఓ రాణిసుస్మిత, డీఎస్పీ రవిబాబు తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఎంపీడీఓలు, సీఐలు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
సమన్వయంతో చర్యలు చేపట్టాలి
వివిధ శాఖల అధికారులకు ఆర్డీఓల సూచన
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 3 : వినాయకచవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఆర్డీఓ రాణిసుస్మిత, డీఎస్పీ రవిబాబు తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఎంపీడీఓలు, సీఐలు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వినాయక చవితి ఉత్స వాలు ప్రశాంతంగా ముగించేందుకు తీసుకోవాల్సి కట్టుదిట్టమైన చర్యలను క్షుణంగా వారికి వివరించారు. అనంతరం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి తెలిపే నియమ, నిబంధనల వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మండపాలు ఏర్పాటుకు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలి
గుంతకల్లుటౌన: వినాయక చవతి సందర్భంగా మండపాల ఏర్పాటు కు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. స్ధానిక ఆర్డీఓ కార్యాలయంలో వినాయక చవతి ఉత్సవాలపై మంగళవారం డివిజనలోని వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... మండపాల వద్ద, నిమజ్జనం చేసేటప్పుడు నిర్వాహకులు తప్పనిస రిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను కొలువు దీర్చాలన్నారు. అనంతరం వినాయక ఘాట్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, తహసీల్దారు రమాదేవి, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, ఎంపీడీఓ శ్రీకాంతచౌదరి, సీఐలు తదిరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....