ASSISTANT COLLECTOR : ఆడపిల్లల స్వీయరక్షణకే అనంత ఆత్మరక్షణ
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:03 AM
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకుసాగేందుకు ఆడ పిల్లలకు స్వీయరక్షణ కోసం అనంత ఆత్మరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ కలెక్టర్ బొల్లినేని వినూత్న పేర్కొన్నారు. అనంత ఆత్మ రక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో నిర్వహించారు.

- అసిస్టెంట్ కలెక్టర్ బొల్లినేని వినూత్న
అనంతపురం టౌన, మార్చి19 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకుసాగేందుకు ఆడ పిల్లలకు స్వీయరక్షణ కోసం అనంత ఆత్మరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ కలెక్టర్ బొల్లినేని వినూత్న పేర్కొన్నారు. అనంత ఆత్మ రక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు తోడ్పాటునందించిన మహిళా అధికారులు, శిక్షకులు, నైపుణ్యాలు నేర్చుకుని ప్రతిభచాటిన అమ్మాయిలకు అసిస్టెంట్ కలెక్టర్ చేతులుమీదుగా ప్రశంసాపత్రాలు అందజేసి అబినం దించారు. అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ... కలెక్టర్ సహ కారంతో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఐసీడీఎస్ నేతృత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20నుంచి దాదాపు 100 విద్యాసంస్థలలో చదువుతున్న 50వేలమంది ఆడపిల్లలకు ఈ నైపుణ్యాలు నేర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సర్వశిక్ష అబియాన ఆధ్వర్యంలో 495 స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదేస్ఫూర్తితో లక్ష మంది ఆడ పిల్లలకు స్వీయరక్షణ నైపుణ్యాలు నేర్పించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ నాగమణి, బీసీ వెల్పేర్ శాఖ డీడీ కొఠారి కుష్బూ, ఎస్‌ఎస్‌ఏ ఏసీపీ శైలజ, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి తదితరులు పొల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....