AP POLITICS: టీడీపీలోకి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి సిద్ధం?.. రంగంలోకి వైసీపీ నేతలు
ABN , Publish Date - Jan 09 , 2024 | 08:46 PM
టీడీపీలోకి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి సంసిద్ధమయ్యారు. టీడీపీలో చేరికపై ముఖ్య అనుచరులతో పార్థసారథి చర్చించారు. పార్థసారథి కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావు వెళ్లారు.

అమరావతి: టీడీపీలోకి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి సంసిద్ధమయ్యారు. టీడీపీలో చేరికపై ముఖ్య అనుచరులతో పార్థసారథి చర్చించారు. పార్థసారథి కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావు వెళ్లారు. టీడీపీలో ఎప్పుడు చేరాలనే దానిపై పార్థసారథితో చర్చించినట్లు తెలుస్తోంది.
పెనమలూరు లేదా నూజివీడు నియోజకవర్గాలు ఏదో ఒకటి పార్థసారథి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్న విషయం తెలుసుకొని పార్థసారథిని బుజ్జగించేందుకు వైసీపీ నాయకులు వచ్చారు. పార్థసారథి కార్యాలయానికి వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు వచ్చి బుజ్జగిస్తున్నారు.