Share News

AP Politics: పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ విస్త్రతస్థాయి సమావేశం.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:22 PM

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారిగా బీజేపీ (BJP) విస్త్రతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్(Samanchi Srinivas) తెలిపారు. రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో జులై 8న ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.

AP Politics: పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ విస్త్రతస్థాయి సమావేశం.. ఎప్పుడంటే?

రాజమహేంద్రవరం: ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారిగా బీజేపీ(BJP) విస్త్రతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్(Samanchi Srinivas) తెలిపారు. రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో జులై 8న ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొంటారని సామించి శ్రీనివాస్ చెప్పారు.


ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.."గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ కేంద్రంగా తిరుమల శ్రీవారి ఆస్తులు, నిధులు దుర్వినియోగం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని జగన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. వైసీపీ అభ్యర్థిని గెలుపించుకోవాడనికి తిరుమల నిధులను అప్పటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వాడుకున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వీర విధేయులకు మాత్రమే తిరుమల కొండ మీద షాపులు కేటాయించారు. హాకర్ లైసెన్స్ కలిగిన వారికి కూడా షాపులు పెట్టుకునేలా గత బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. ఆ తీర్మానం కాపీని బయటకు రాకుండా కరుణాకర్ రెడ్డి దాచిపెట్టారు. వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని ఆదేశాలు ఇచ్చి మరీ 16మందికి షాపులు కేటాయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో డబ్బులు ఇచ్చిన వారంతా భూమనను నిలదీశారు. దీంతో పాత తేదీలతో సంతకాలు పెట్టి వారికి దుకాణాలు కేటాయించినట్లు పత్రాలు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి ఈవో విజిలెన్స్ విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:

AP Politics: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దూకుడు పెంచిన పోలీసులు..

Updated Date - Jul 06 , 2024 | 05:25 PM