-
-
Home » Andhra Pradesh » Breaking News August 28th Today Latest Telugu News Live Updates
-

Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Aug 28 , 2024 | 08:25 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Live News & Update
-
2024-08-28T14:16:33+05:30
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక పరిణామం
ఢిల్లీ:పోలవరం నిధులకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ప్రతిపాదనలు
పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కాబినెట్ ఆమోదం
3 గంటలకు అధికారికంగా కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించనున్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యులను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
12,500 కోట్ల ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా నవంబర్ నుంచి పోలవరం పనులను వేగం పెంచేందుకు కీలకం కానున్న మొదటి దశ ప్యాకేజీ నిధులు
-
2024-08-28T12:00:19+05:30
వైసీపీకి మరో షాక్
బాపట్ల జిల్లా: వైసీపీకి మరో షాక్
వైసీపీని వీడుతున్న ఎంపీ మోపిదేవి వెంకట రమణ
రేపు వైసీపీకి రాజీనామా
త్వరలో టీడీపీలో చేరే అవకాశం.
ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి.
-
2024-08-28T11:49:26+05:30
వర్చువల్‌గా కవిత హాజరు
ఢిల్లీ: బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, న్యాయవాది మోహిత్ రావు.
రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరుకానున్న కవిత, న్యాయవాది మోహిత్ రావు
మధ్యాహ్నం 12 గంటలకు లిక్కర్ పాలసీలో సీబీఐ చార్జ్ షీట్ పై విచారణ జరపనున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా
-
2024-08-28T11:28:26+05:30
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటన
అమరావతి: ఎల్లుండి నరసరావు పేటలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన.
వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడిగా సీఎం, డిప్యూటీ సీఎం తొలి పర్యటన, తొలి ప్రభుత్వ కార్యక్రమం
-
2024-08-28T11:10:14+05:30
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పరిణామం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక ప్రతిపాదన
పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం
మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
12,500 కోట్ల ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా నవంబర్ నుంచి పోలవరం పనులను వేగం పెంచేందుకు కీలకం కానున్న మొదటి దశ ప్యాకేజీ నిధులు
-
2024-08-28T11:03:46+05:30
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి: ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం
మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరి పోస్టుల భర్తీకి నిర్ణయం
పౌరసరఫరాల శాఖలో 2771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు అనుమతి
-
2024-08-28T10:45:10+05:30
కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
అమరావతి: కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
14 అంశాలతో అజెండాగా సమావేశం
పౌర సరఫరాలు, రెవెన్యూ, మున్సిపల్, జీఏడీ
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ప్లానింగ్, ఇరిగేషన్ శాఖల అంశాలు ప్రధాన అజెండాగా సమావేశం
-
2024-08-28T10:24:28+05:30
హైడ్రా దూకుడు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు.
దుండిగల్‌లో గల ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు
చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు.
15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ.
కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి లేనిపక్షంలో చర్యలు తప్పవంటూ హైడ్రా నోటీస్.
చెరువులో నిర్మించిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను పరిశీలించిన హైడ్రా బృందం.
గతంలో చిన్నదామోర చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన కొన్ని బిల్డింగులు కూల్చేసిన మున్సిపల్ అధికారులు.
-
2024-08-28T09:07:12+05:30
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ.. ఆ తర్వాత
లిక్కర్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ
వసంత్ విహార్‌లో గల పార్టీ కార్యాలయంలో బసచేసిన కవిత
తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరనున్న కవిత
-
2024-08-28T08:40:18+05:30
తాడిపత్రిలో అక్రమ ఇసుక వివాదం
అనంతపురం: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బృందం
అస్మిత్ రెడ్డి బృందంపై దాడి చేసిన టిప్పర్ యజమానులు
టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డికి సూచించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
టిప్పర్ యజమానులపై కేసు నమోదు చేయని సీఐ
తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట వర్షంలో నిరసన తెలిపిన ఎమ్మెల్యే
దిగొచ్చిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.. క్షమాపణలు చెప్పడంతో సద్దుమణిగిన వివాదం
-
2024-08-28T08:25:06+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.