Share News

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:04 AM

అమరావతి: తెలుగు రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..

అమరావతి: తెలుగు రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి (Five people died) చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.


తిరుమల.. రెండవ ఘాట్ రోడ్‌లో ప్రమాదం..

తిరుమల రెండోవ ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో అదుపుతప్పి లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీలోని డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. ఘాట్ రోడ్ మరమ్మతు పనులు కోసం లారీ మెటీరియల్‌ను తీసుకెళుతోంది. ఈ క్రమంలో లారీ రెండు చక్రాలు విడిపోయి కొద్ది దూరం వరకు రోడ్డుపై లారీ దూసుకెళ్లింది. ఆ సమయంలో భక్తుల వాహనాల రాకపోకలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.


సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.

సంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది మండలం, తనికిళ్ల వద్ద నాందేడ్- అకోలా జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు పుల్కల్ మండలం, ఇసాజిపేట, గంగోజి పేటకు చెందిన వాళ్లుగా గుర్తించారు. హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


హైదరాబాద్‌లోని చంపాపేట ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్థంబానికి ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సూఫీయాన్. మహమూద్ అద్నాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యాసిన్, మహావేర్, మవ్యలు తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారంతా చాంద్రాయణగుట్ట రాజ్ నగర్ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

వ్యవస్థలను కుప్పకూల్చారు!

పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్‌’

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 25 , 2024 | 09:04 AM