Tiruchanuru: మాడవీధుల్లో సింహ వాహన సేవ రద్దు
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:51 AM
తుఫాను నేపథ్యంలో శనివారం ఉదయం నుంచీ జడివాన కురుస్తుండడంతో రాత్రి తిరుమాడవీధుల్లో జరగాల్సిన సింహవాహన సేవను వాహన మండపానికే పరిమితం చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుచానూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తుఫాను నేపథ్యంలో శనివారం ఉదయం నుంచీ జడివాన కురుస్తుండడంతో రాత్రి తిరుమాడవీధుల్లో జరగాల్సిన సింహవాహన సేవను వాహన మండపానికే పరిమితం చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సాయంత్రం ఊంజల్ సేవ జరిగాక సింహవాహనంపై అమ్మవారిని కొలువుదీర్చారు. వాహన మండపం నుంచే భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో వేచివున్న భక్తులు వాహనమండపానికి చేరుకుని కర్పూర, నారికేళ హారతులు సమర్పించారు. వర్షం కారణంగా సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ఆలయ పరిసరాలు బోసిపోయాయి. వాహన సేవ ముందు సాంస్కృతిక ప్రదర్శనలకోసం వచ్చిన ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులకు మహతిలో జరుగుతున్న కార్యక్రమాల్లో అవకాశం కల్పించారు.