Share News

YAMINI SADINENI: లడ్డూలో అపవిత్ర పదార్థాలు కలిపారు.. యామిని సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 23 , 2024 | 08:45 PM

వైసీపీ ప్రభుత్వంలో 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆలయాల ధ్వసంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

YAMINI SADINENI: లడ్డూలో అపవిత్ర పదార్థాలు కలిపారు.. యామిని సంచలన వ్యాఖ్యలు
YAMINI SADINENI

విజయవాడ: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి భక్తులకు ఇచ్చే లడ్డూలు నాణ్యతగా లేకపోవడం బాధాకరమని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తిరుమల లడ్డూకు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. లడ్డూ కల్తీపై తనకు మాట్లాడటానికి కూడా కొంత ఇబ్బందిగా ఉందని అన్నారు. పవిత్రంగా లడ్డూలో కలపాల్సిన పదార్థాలు చాలా ఉన్నాయని అన్నారు. అవి కాకుండా అపవిత్రంగా ఉండే పదార్థాలు కలిపారని మండిపడ్డారు.


ALSO READ: Tirumala..శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..

జగన్ ప్రభుత్వంలో కేసులు..

‘‘మనకు తెలియకుండా ఇన్నిరోజులు కల్తీ చేసిన లడ్డూను తిన్నామా.. ఇంత ఘోరాతి ఘోర మహాపాపం తెలియకుండానే మూటకట్టుకున్నామా. 100 పాపాలను శ్రీకృష్ణుడు ఓపికగా లెక్క పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. జగన్ ప్రభుత్వం ఆలయాల ధ్వసంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టింది. మేము కూడా తిరుమల లడ్డూని పంచాం. ఆ భగవంతుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తిరుమలకు వచ్చాం’’ అని యామిని వెల్లడించారు.


ALSO READ: Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంలో నిజాలు బయటకు రావాలి: పొన్నవోలు సుధాకర్ రెడ్డి

ధర్మాన్ని రక్షించుకోవాలి..

‘‘అప్పుడేనా శ్రీనివాసులు కొంచెం కరుణిస్తాడేమో.. మా కాలనీలో ఉన్న మహిళలతో తిరుమలకు రావాలని అనుకున్నాం. ఈ విషయం తెలిసిక మనసు భారంతో ఉన్నాం. ఇప్పుడు తిరుమలలో పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి మళ్లీ ధైర్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి. ధర్మాన్ని రక్షించుకోవడం మన చేతిలో ఉంది. ధర్మాన్ని పరిరక్షించుకోవడం మన ఇంటి నుంచే మొదలవ్వాలి. కాబట్టి ఈ చిన్న ప్రయత్నంలో భాగంగా తిరుమలలో 11 ప్రదక్షిణాలు చేశాం’’ అని సాదినేని యామిని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Tirumala..శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 08:46 PM