మెట్టు మెట్టుకు పూజలు
ABN , Publish Date - Dec 16 , 2024 | 01:09 AM
అన్నవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం మెట్లోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. ఉదయం 7 గంటలకు కొండపై నుంచి స్వామి,అమ్మవార్లను పల్లకీలో కొండదిగువకు తీసుకునివచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. 9.30కి తొలిపావంచా వద్ద ప
సత్యదేవుడి సన్నిధిలో వేడుకగా మెట్లోత్సవం
పసుపు, కుంకుమలు పూసేందుకు తరలివచ్చిన మహిళలు
అన్నవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం మెట్లోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. ఉదయం 7 గంటలకు కొండపై నుంచి స్వామి,అమ్మవార్లను పల్లకీలో కొండదిగువకు తీసుకునివచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. 9.30కి తొలిపావంచా వద్ద పల్లకీలో స్వామి,అమ్మవార్లకు ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం స్వామివారి అష్టోత్తరశతనామాలతో పూజలు నిర్వహించారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం తొలిమెట్టు వద్ద ఈవో సుబ్బారావు హారతులివ్వగా మహిళలు పసుపు, కుంకుమలతో మెట్టు మెట్టుకు పూశారు. ముందు పల్లకీలో స్వామిఅమ్మవార్లను మేళతాలాలతో తీసుకెళ్లగా పల్లకీవెంట మహిళలు హారతులు వెలిగించి పటికబెల్లం నివేదన చేసుకుంటూ ప్రధానాలయానికి చేరుకున్నారు. పీఆర్వో కొండలరావు, సహాయ కమిషనర్ సీహెచ్ రామ్మోహనరావు పాల్గొన్నారు. అలాగే రత్నగిరిపై వారాంతపు ఆర్జిత సేవయిన రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
భక్తులతో కిక్కిరిసిన రత్నగిరి
సత్యదేవుడి సన్నిధి ఆదివారం పౌర్ణమి పర్వదినం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. సెలవు, పౌర్ణమి పర్వదినం, శనివారం రాత్రి రత్నగిరిపై వివాహమాచరించుకున్న జంటలు, వివిధ ప్రాం తాల్లో పెళ్లైన నూతన జంటలతో రద్దీ ఏర్ప డింది. సుమారు 3వేల వ్రతాలు జరగగా వివిధ విభాగాల ద్వారా రూ.40 లక్షల ఆదాయం లభించింది.
ఆలయ సిబ్బందితో నూతన ఈవో సమీక్ష సమావేశం
అన్నవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించిన వీర్ల సుబ్బారావు ఆదివారం సాయంత్రం దేవస్థానం అన్ని విభాగాల ఏఈవోలు, సూపరెంటెండెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పరిచయ కార్య క్రమం అనంతరం దేవస్థానంలో విభాగాల వారీగా రివ్యూ నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి భక్తులే మూలమని, భక్తులకు ఏవిధంగా మరింత మె రుగైన సేవలు అందించగలం, కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉదయమే 5గంటలకు అకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. సన్నిధి బుకింగ్ కౌంటర్, కమాండ్ కంట్రోల్ రూంలను పరిశీలించారు. సెక్యూరిటీ వ్యవస్థపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.