Share News

హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:19 AM

పెద్దాపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజ లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెర వేరుస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని ఆర్‌బీపట్నం, జె.తిమ్మా పురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తుమ్మ

హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న చినరాజప్ప

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజ లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెర వేరుస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని ఆర్‌బీపట్నం, జె.తిమ్మా పురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తుమ్మల రామస్వామి (బాబు)తో కలిసి పాల్గొన్న రాజప్ప మాట్లాడుతూ ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిల బెట్టుకుంటామన్నారు. గ్రామాల అభివృద్దికి సమిష్టిగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి శంకు స్థాపన లు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో డి.శ్రీలలిత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజాసూరి బాబురాజు, రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ కార్పోరేషన్‌ సభ్యురాలు తుమ్మల పద్మజ, కూటమి నేతలు మన్యం ప్రసన్నకుమార్‌, కల్తూరి శ్రీనివాస్‌, సాని పల్లి సురేష్‌, పెనుమర్తి దొరబాబు పాల్గొన్నారు.

సామర్లకోట: మహాత్మాగాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంలోనే సాధ్య మవుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో పల్లెపండుగ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రూ.70 లక్షల వ్యయంతో చేపట్టను న్న పలు సీసీరోడ్లు నిర్మాణాలకు రాజప్ప, జన సేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ ఇంచార్జి వెంకటరమణలతో కలిసి కొబ్బరికాయలు కొట్టి శ్రీకారం చుట్టారు. సర్పంచ్‌ మేడిశెట్టి సుగు ణమ్మ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు. కాలనీ వాసుల సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ పల్లాబ త్తుల వసంతమాధవి, తహశీల్దార్‌ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి, పెంకే వెంకటేష్‌, తోటకూర శ్రీని వాస్‌, కుర్రా నారాయణస్వామి, ఏపీవో జగదీశ్వరి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, మేడిశెట్టి నానీప్రసాద్‌, మాజీ ఎంపీపీ మేడిశెట్టి వీరభద్రం, ఎంపీటీసీ చిందాడ లక్ష్మీదుర్గ, అడ్డాల వెంకన్న బాబు, ముమ్మిడి సూరిబాబు తదితరులున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:19 AM