Share News

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సీఎంవో కీలక ప్రకటన

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:27 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఊహించని విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు...

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సీఎంవో కీలక ప్రకటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఊహించని విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకూ ప్రమాణ స్వీకారంపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఒకసారి జూన్-09 తారీఖు అని.. మరోసారి 10న అని.. ఆ తర్వాత 12న ఉండొచ్చని వార్తలు పెద్ద ఎత్తునే వచ్చిన పరిస్థితి. ఇక సభావేదికగా ఎక్కడ ఉండొచ్చనే దానిపైనా పెద్ద కన్ఫూజనే నెలకొంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుందని వేయి కళ్లతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ఈ రూమర్స్, గందరగోళానికి చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎంవో కీలక ప్రకటన చేసింది.


ప్రకటనలో ఏముంది..?

శనివారం రాత్రి 10:50 గంటలకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సీఎంవో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు జూన్-12న ఉదయం 11:27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ట్వీట్‌లో స్పష్టం చేసింది. ఈ ప్రమాణానికి కృష్ణా జిల్లాలోని గన్నవరం దగ్గరున్న కేసరపల్లి ఐటీ పార్క్ వేదిక కానుందని సీఎంవో అధికారిక ప్రకటన చేసింది. మొత్తానికి.. ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’కు ముహూర్తం ఫిక్స్ అయిపోయిందన్న మాట. కాగా.. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు సీనియర్ నేతలు, అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ ముఖ్యనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేయనున్నారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలు, భారీగా కూటమి శ్రేణులు విచ్చేయనున్నాయి. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులుగా ఎవరెవరు ప్రమాణం చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అనిల్ యాదవ్ అడ్రస్ లేడేం..!

Updated Date - Jun 08 , 2024 | 11:01 PM