Share News

AP Election 2024: ఎన్నికలకు 6 నెలల ముందు జగన్ నిద్ర లేచాడు: వైఎస్ షర్మిల

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:35 PM

ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తన అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ హడావిడి చేస్తున్నారని, మద్యపాన నిషేధమని ని మోసం చేశారని ధ్వజమెత్తారు.

AP Election 2024: ఎన్నికలకు 6 నెలల ముందు జగన్ నిద్ర లేచాడు: వైఎస్ షర్మిల

జమ్మలమడుగు: ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తన అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ హడావిడి చేస్తున్నారని, మద్యపాన నిషేధమని ని మోసం చేశారని ధ్వజమెత్తారు. ‘‘ మద్య నిషేధం అని చెప్పి జగన్ గారే లిక్కర్ అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా కల్తీ మద్యం. ఏపీలో కల్తీ మద్యం కారణంగా 25 శాతం అదనపు మరణాలు పెరిగాయి. అంతా భూమ్ భూమ్, డీఎస్సీ, క్యాపిటల్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లే కనిపిస్తున్నాయి. జగన్ హామీలు లిక్కర్ షాపులో నిలబడ్డాయి’’ అని మండిపడ్డారు. జమ్మలమడుగులో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.


సీబీఐ దగ్గర ఆధారాలు ఉన్నా అవినాశ్ వెంట్రుక కూడా పీకలేదు: వైఎస్ షర్మిల

వివేకానంద రెడ్డి జగన్‌కి స్వయానా చిన్నాయన అని, వివేకా తెలియని వ్యక్తి ఈ జిల్లాలో ఎవరూ లేరని షర్మిల అన్నారు. ఆయన లాంటి నాయకుడు బూతద్దం పెట్టీ చూసినా ఎక్కడా దొరకడని ఆమె పేర్కొన్నారు. అలాంటి నాయకుడిని ఘోరంగా నరికి చంపారని, హత్య చేసి 5 ఏళ్లు దాటిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ హంతకులకు ఇవ్వాళ్టి వరకు శిక్ష పడలేదు. అధికారం అడ్డుపెట్టి జగన్ దోషులను కాపాడుతున్నారు. అధికారం ఉండి రాష్ట్రాభివృద్ధి చేతకాలేదు. జగన్‌కి కేవలం హత్యా రాజకీయాలు చేయడం మాత్రమే చేతనయ్యింది. సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అయినా అవినాష్ రెడ్డి వెంట్రుక కూడా పీక లేకపోయింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని 2 రోజులు కర్నూల్‌లో కాపు కాసినా కుదరలేదు. అధికారం అడ్డుపెట్టుకొని హంతకులు బయట తిరుగుతున్నారు. హత్యా రాజకీయాలను ఎదురించేందుకు నేను ఎంపీగా నిలబడ్డాను. హత్యలు చేసిన వాళ్లు చట్ట సభలోకి వెళ్ళొద్దని నేను ఈ ధైర్యం చేశాను. హత్యలు చేయించిన అవినాష్ రెడ్డి కావాలో... న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ఆర్ బిడ్డ కావాలో ప్రజలు ఆలోచన చేయాలి. మీ మధ్యనే ఉంటా. మీతోనే బ్రతుకుతా. మీ కోసమే సేవ చేస్తా’’ అని వైఎస్ షర్మిల అన్నారు.

జమ్మలమడుగు నా జన్మస్థానం

‘‘జమ్మలమడుగు నా జన్మస్థానం. ఇదే జమ్మలమడుగులో వైఎస్ఆర్ సైతం పుట్టారు. వైద్యుడిగా వైఎస్ఆర్ ఇదే జమ్మలమడుగులో సేవ చేశారు. అన్న జగన్ మోహన్ రెడ్డి గారు సైతం ఇక్కడే పుట్టాడు. జగన్ ఇక్కడ పుట్టడం ఏమో కానీ... ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి కూడా కండువా వేశాడట. పార్టీ కార్యక్రమాల్లో తిప్పుతున్నాడట. దట్ ఇస్ జగన్ మోహన్ రెడ్డి. జమ్మలమడుగు గుట్టల ప్రాంతం. ఇక్కడ వైఎస్ఆర్ కడప స్టీల్ పెట్టాలని అనుకున్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేది. చంద్రబాబు ఒకసారి భూమి పూజ చేశాడు. జగన్ రెండు సార్లు భూమి పూజ చేశాడు. చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్లుంది కడప స్టీల్ పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ నీ భూమి పూజల ఫ్యాక్టరీ చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క రోజు ఆందోళన చేయలేదు. కనీసం పార్లమెంట్‌లో ఒక్క రోజు మాట్లాడలేదు. ఇక జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు’’ అని అన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 08:16 PM