Share News

AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:09 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో(Election Affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్‌ పోలీసులు ..

AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!
Chandrababu Properties

కుప్పం/చిత్తూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో(Election Affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్‌ పోలీసులు కేసు పెట్టారు. 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సమయంలో కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదైంది. ఇక మిగిలిన 22 కేసులూ వైసీపీ ఈ ఐదేళ్లలో పెట్టింది. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. మంగళగిరిలో సీఐడీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 8 కేసులున్నాయి. 2023లో 2, 2022లో 1, 2021లో 3, 2020లో 2 కేసులను సీఐడీ పోలీసులు నమోదు చేశారు.


కరోనా రెండో దశలో చంద్రబాబు 440కే వేరియెంట్‌ గురించి మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు టౌన్‌ అరండల్‌పేట, పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్‌, కర్నూలు వన్‌ టౌన్‌లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు విజయవాడ నగరంలోని సూర్యాపేట స్టేషన్‌లో ఓ కేసు పెట్టారు. అన్నమయ్య జిల్లా ముదివేడు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్టేషన్లలో హత్యాయత్నం కేసులున్నాయి. ముదివేడు స్టేషన్‌ పరిధిలో టీడీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు రెచ్చగొట్టి పంపించారని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


బంగారం లేదు!

చంద్రబాబు పేరుతో రూ.4.80 లక్షల చరాస్తులు, రూ.36.31 కోట్ల స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.2,22,500 విలువ చేసే ఓ అంబాసిడర్‌ కారు ఉంది. ఆయన పేరుతో బంగారం లేదు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి రూ.3.48 కోట్ల హౌసింగ్‌ లోన్‌ తీసుకున్నారు. అలాగే ఆయన భార్య భువనేశ్వరికి చరాస్తులు రూ.810.37 కోట్లు. స్థిరాస్తులు రూ.85.10 కోట్లు, అప్పులు రూ.6.83 కోట్లు ఉన్నాయి.

ఇవికూడా చదవండి:

భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...

కులో వెయ్యి కేజీల బంగారం డిపాజిట్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 12:10 PM