AP Elections: ఆరోగ్యం బాగోలేకున్నా.. ఎన్నికల విధులకు రావాల్సిందే.. టీచర్‌కు వింత పరిస్థితి
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:09 PM
Andhrapradesh: మచిలీపట్నం మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయిని సునంద కుమారిని కూడా ఎన్నికల్లో విధుల బాధ్యతలను అప్పగించారు. అయితే తాను ఎన్నికల విధుల్లో పాల్గొనలేని ఉపాధ్యాయురాలు తెలిపారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని.. ఎన్నికల విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. సునంద కుమారి కాలికి గాయం అవడంతో ప్రస్తుతం వీల్‌చైర్‌లో ఉన్నారు.
కృష్ణా జిల్లా, ఏప్రిల్ 25: మరో 20 రోజుల్లో ఏపీలో ఎన్నికలు (AP Elections) జరుగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులకు (Government Employees) ప్రభుత్వం వివిధ బాధ్యతలను అప్పగిస్తుంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్నికల విధులలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎవరెవరు ఏ బాధ్యతలు చేయాలనే దానిపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి కూడా...
AP Elections 2024: పవన్‌ను పెళ్లాల పేరిట విమర్శించే వైఎస్ జగన్‌కు భారీ షాక్!
అరోగ్యం బాగోలేదని అంటున్నా...
ఇదే విధంగా... మచిలీపట్నం మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయిని సునంద కుమారిని కూడా ఎన్నికల్లో విధుల బాధ్యతలను అప్పగించారు. అయితే తాను ఎన్నికల విధుల్లో పాల్గొనలేని ఉపాధ్యాయురాలు తెలిపారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని.. ఎన్నికల విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. సునంద కుమారి కాలికి గాయం అవడంతో ప్రస్తుతం వీల్‌చైర్‌లో ఉన్నారు.ఈ కారణంగా ఎన్నికల విధుల్లో పాల్గొన లేనని ఉపాధ్యాయురాలు వాపోయారు.
Tamilisai: మైనార్టీలకు మోదీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు..
అయితే అనారోగ్యం పాలైనా ఎన్నికల విధులకు హాజరు కావాలంటూ సునందకు బందరు ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనాలంటూ ఆర్డీవో కార్యలయం సిబ్బంది ఫోన్లు చేస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనలేనంటూ సునంద కుమారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక వీల్‌చైర్‌లోనే ఆర్డీవో కార్యాలయానికి వచ్చి తన గోడును విన్నించుకున్నారు ఉపాధ్యాయిని సునంద కుమారి. మరి ఆర్డీవో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
YS Sharmila: మోదీ ఢిల్లీ అన్నారు.. జగన్ వాషింగ్టన్ అన్నారు... చివరకు మిగిలింది మట్టే..
Read Latest AP News And Telugu News