Share News

YSRCP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు వైసీపీ ఎమ్మెల్యే యత్నం

ABN , Publish Date - Mar 19 , 2024 | 10:40 AM

Andhrapradesh: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు యత్నించారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్ధిని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఉదయం ఏడు గంటలకు రాచమల్లు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారుల బృందం 9:30 గంటలకు ప్రచారం వద్దకు చేరుకుంది.

YSRCP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు వైసీపీ ఎమ్మెల్యే యత్నం

కడప, మార్చి 19: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి (YSRCP MLA Rachamallu Shivaprasad Reddy) ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు యత్నించారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్ధిని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఉదయం ఏడు గంటలకు రాచమల్లు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారుల బృందం 9:30 గంటలకు ప్రచారం వద్దకు చేరుకుంది. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి...

Atchannaidu: వైసీపీ రాక్షస జాతి పార్టీ..

Breaking: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు...


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 11:09 AM