Share News

AP: ఇలాంటి వారిని అస్సలు వదలద్దు.. కఠినంగా శిక్షించండి..

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:25 PM

నాలుగు సంవత్సరాల తరువాత ఆంధ్రకు వచ్చిన గోవింద నంద సరస్వతి స్వామీజీ నకిలీ అఘోరీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయప్రాంతులు గురి చేస్తున్న నకిలీ అఘోరీలను ప్రభుత్వాలు కఠినంగా శిక్షిస్తే వీళ్ళ భూతం వదులుతుందన్నారు.

AP: ఇలాంటి వారిని అస్సలు వదలద్దు.. కఠినంగా శిక్షించండి..
Govinda Nanda Saraswati Swamiji

కృష్ణా: గోవింద నంద సరస్వతి స్వామీజీ ఆంధ్రాలో విజయ యాత్రకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కర్ణాటక పంపా క్షేత్ర సాధకులు, ద్వారక, బద్రి, జ్యోతిష్ పీఠం శిష్యులు గోవిందానంద సరస్వతి స్వామీజీ ఐదు రోజులు పాటు ఆంధ్రాలో విజయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తరువాత ఆంధ్రకు వచ్చినట్లు తెలిపారు. అఘోరీ, నకిలీ స్వామీజీలు, నకిలీ పీఠాధిపతులు అని చెప్పుకుంటు ఆంధ్రాలో కొందరు తిరుగుతున్నారని.. ప్రజలను భయప్రాంతులు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నకిలీ అఘోరీపై 420 సెక్షన్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నకిలీ అఘోరీలు రోడ్లపై తిరిగేటప్పుడు ప్రజలు ఎదిరించాలని సూచించారు. ప్రభుత్వాలు ఇలాంటి అఘోరీలను కఠినంగా శిక్షిస్తే వీళ్ళ భూతం వదులుతుందన్నారు. ఉత్తర భారత దేశంలో అఘోరీలు, నాగ సన్యాసులు, ఎక్కడ ఉంటారో తమకు తెలుసని పేర్కొన్నారు. 2025 మహాకుంభం రానుందని.. జగద్గురువు శంకరాచార్యుల నిజమైన సైన్యం అఘోరీలు, అఖడాలు అక్కడికి వస్తారని తెలిపారు.

Updated Date - Nov 26 , 2024 | 03:25 PM