AP Politics: పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ సర్‌ప్రైజ్.. ఆ లోగోలో ఏముందో తెలుసా..
ABN , Publish Date - Aug 26 , 2024 | 03:42 PM
సెప్టెంబర్ 2 లోగో చూడగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గుర్తొస్తుందా. అవును నిజమే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గుర్తుచేస్తూ ఆయన అభిమానులు సెప్టెంబర్2తో ఓ లోగోను తయారుచేశారు. ప్రస్తుతం ఈలోగో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 2 లోగో చూడగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గుర్తొస్తుందా. అవును నిజమే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గుర్తుచేస్తూ ఆయన అభిమానులు సెప్టెంబర్2తో ఓ లోగోను తయారుచేశారు. ప్రస్తుతం ఈలోగో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయినప్పటినుంచి ఓ సంచలనంగా మారారు. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి బాధ్యతాయువతంగా పనిచేయడమే కాదు.. ఆయన మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ తాను మారడమే కాదు.. తన అభిమానుల ఆలోచనలు సైతం తనలా ఉండేలా మార్చేశారు. ఏ విషయమైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం అలవాటున్న పవన్ కళ్యాణ్ అభిరుచులను ఆయన అభిమానులు త్వరగానే అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని రూపొందించిన సెప్టెంబర్ 2 లోగో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖలను వివరిస్తూ ఆయన అభిమానులు ఈలోగో తయారుచేశారు.
AP News: ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రతి బర్త్‌డే వెరీ స్పెషల్..
గత కొన్నేళ్లుగా తన పుట్టినరోజు వేడుకలను సామాజిక స్పృహతో పవన్ కళ్యాణ్ జరుపుకుంటున్నారు. రక్తదానం, ఆసుపత్రులు, పాఠశాలల్లో శ్రమదానం, పేద ప్రజలకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు. తాజాగా ఈ ఏడాది పవన్ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కావడంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇంకేముంది ఇప్పటినుంచే పవన్ ఫ్యాన్స్ ఆ పనుల్లో నిమగ్నమైపోయారు.
Nara Lokesh: ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా విశాఖకు లోకేష్.. పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు
ఫ్యాన్స్ సర్‌ప్రైజ్
పుట్టినరోజు ముందే పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే గిఫ్ట్‌లు ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం పవన్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2లోగోను ఆయన అభిమానులు తయారుచేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను ఈ లోగో సూచిస్తుంది. ఏనుగు, ఏడ్ల బండి, చెట్లు, నీరు ఇలా అన్ని రకాలను ఈలోగోలో ఉన్నాయి. సెప్టెంబర్ 2లోగో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది. పంచాయతీరాజ్ శాఖను సూచించేలా రైతు ఏడ్ల బండి తోలుతున్న చిత్రం, గ్రామీణాభివృద్ధిని సూచిస్తూ పల్లె వాతావరణం, అటవీ, పర్యావరణ శాఖకు సూచికగా ఏనుగు, సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా ఓ చిహ్నం ఈ లోగోలో కనిపిస్తాయి. ప్రత్యేక లోగో తయారుచేయడం అందులోనూ ఆయన మంత్రిత్వశాఖను సూచించేవిధంగా ఉండటం ద్వారా పవన్ కళ్యాణ్‌కు ఆయన అభిమానులు బర్త్‌డేకు ముందే బహుమతిని అందించారంటూ చర్చ జరుగుతోంది.
Bopparaju Venkateswarlu: నెలకు రూ.54 ఇస్తే నిర్వహణ ఎలా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News