AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ
ABN , Publish Date - Jul 18 , 2024 | 09:24 AM
బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై విపక్ష వైసీపీ చేస్తున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది.
అమరావతి: బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై విపక్ష వైసీపీ చేస్తున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది. పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయ్‌ని చంపేసి.. చంద్రబాబు చంపాడని పేపర్‌లో వేసిన నీచ చరిత్ర వీళ్లదని టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడింది.
‘‘తప్పు ఎవ్వడు చేసినా తప్పే... తప్పు చేసిన వాడిని కూడా కఠినంగా శిక్షించాలి. 5 ఏళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఈ వైసీపీ సైకోలకి పట్టిన మదం దించి, గంజాయిని అరికట్టటం, వైసీపీ సైకోలు చేసే ఈ దారుణాలు ఆపటడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని టీడీపీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. హతుడు షేక్ రషీద్, చంపిన వ్యక్తి షేక్ జిలానీ ఇద్దరూ వైసీపీ వారేనని, వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చెలామణి అవుతున్న వైసీపీ నేత పీఎస్ ఖాన్‌కు ప్రధాన అనుచరులు అనే విషయాన్ని పేర్కొంది. జగన్ రెడ్డికి ఈ పీఎస్ ఖాన్ ప్రధాన అనుచరుడు అని మండిపడింది. ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తెలుగు దేశం పార్టీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.
కాగా షేక్ రషీద్ హత్యను తెలుగుదేశం పార్టీ మీదకు నెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇవాళ (గురువారం) ఉదయం ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలంటూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని ట్యాగ్ చేసి వైసీపీ పోస్ట్ పెట్టింది. తాము కూడా భారతదేశంలో భాగమేనంటూ పేర్కొంది.
ఇద్దరూ మిత్రులే... వైసీపీకి చెందిన వారే
కాగా వారిద్దరూ ఇద్దరూ మిత్రులే... మరో పేరుమోసిన రౌడీకి ప్రధాన అనుచరులే. రాజకీయ పార్టీ వైసీపీతో అంటకాగిన వారే. ఎన్నికల ముందు ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు పొడసూపాయి. ఆ గొడవులు చివరికి బుధవారం రాత్రి నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో నరుక్కునే వరకూ దారితీశాయి. హతుడు షేక్ రషీద్(25) ముండ్లమూరు బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తున్నాడు. అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు, పట్టణానికి చెందిన షేక్ జిలానీ కత్తితో రషీద్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతలు, తల, మెడపై కత్తితో కొట్టాడు. రషీద్ చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయింది.
ఇవి కూడా చదవండి
TDP: టీడీపీలో చేరబోతున్నామంటూ వంశీ అనుచరుల హల్‌చల్
వీరు మారరా? క్షేత్రస్థాయిలో ఇంకా ‘వైసీపీ’ పోలీసులే
For more AP News and Telugu News