Share News

AP News: ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ విధానాన్ని నిలిపివేయాలి: వైవీ ఈశ్వరరావు

ABN , Publish Date - May 30 , 2024 | 09:22 PM

వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ విధానాన్ని నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి (CS Jawahar Reddy) ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వైవీ ఈశ్వరరావు (YV Eswara Rao) గురువారం లేఖ రాశారు.

AP News: ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ విధానాన్ని నిలిపివేయాలి: వైవీ ఈశ్వరరావు

అమరావతి: వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ విధానాన్ని నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి (CS Jawahar Reddy) ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వైవీ ఈశ్వరరావు (YV Eswara Rao) గురువారం లేఖ రాశారు. జూన్ 1వ తేదీ నుంచి పెంపుదల చేయ తలపెట్టిన అపరాధ రుసుం వెంటనే నిలిపివేయాలని కోరారు.ఇప్పటికే ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, రవాణా వాహనదారులపై వివిధ రూపాల్లో పెనాల్టీలు విధిస్తున్నారని తెలిపారు.


పలురకాల పన్నుల పెంపుతో ప్రజలు తీవ ఇబృందులు పడుతున్నారని చెప్పారు.అధిక మొత్తంలో పెనాల్టీలు పెంపుతో అవినీతి పెరిగిపోతున్నది తప్ప సమాజానికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు.ఇప్పటికే రవాణా వాహనదారులు ప్రస్తుతం ఉన్న పెనాల్టీలు కట్టలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెనాల్టీలను ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తుందన్నారు. జూన్ 1వ తేదీని నుంచి పెంపుదల చేయతలపెట్టిన పెనాల్టీలను నిలిపివేసి పాత పద్ధతిలోనే వసూలు చేయాలని వైవీ ఈశ్వరరావు కోరారు.

Updated Date - May 30 , 2024 | 09:22 PM