విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:19 PM
కొత్తపల్లె పంచాయితీ అమృతనగర్ లో ఓ ఇంటి వద్ద పందిరి వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి బాబ్జాన్ (40) మృతిచెందాడు.
పందిరి వేస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం
లైన్లు వేలాడుతూ వుండడమే కారణం
ప్రొద్దుటూరు, ఆగస్టు 28: కొత్తపల్లె పంచాయితీ అమృతనగర్ లో ఓ ఇంటి వద్ద పందిరి వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి బాబ్జాన్ (40) మృతిచెందాడు. అమృతనగర్ మడూరురోడ్డు లోని మసీదు ఎదురుగా వున్న ఆశావర్కర్ శశికళ ఇంటి గృహప్రవేశానికి ఇంటిపైన పైపుల పందిరి వేస్తున్నారు. దీంతో ఇంటిని ఆనుకుని వున్న విద్యుత్ తీగలు తగలడంతో బాబ్జా న్ ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాలపాలై మృతి చెందా డు. గృహప్రవేశం చేయనున్న ఇంటికి ఆనుకుని విద్యుత్ లైన్లు వుండడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్ధానికులు వివరించారు.
బాబ్జాన్ లక్ష్మీవెంకటేశ్వర సప్లయర్స్‌లో పనిచేస్తు న్నాడు. అతనికి తల్లి, భార్య హసీనా బాబాతోషిక్, మహ్మద్ రఫీ ఇద్దరు కొడుకులున్నారు. కూలి చేసుకుంటే తప్ప పూట గడవని కుటుంబం బాబ్జాన్‌దని ఇంటికి పెద్దగా ఆదరువుగా వుండే వ్యక్తి ఇలా అకాల మరణం చెందడం ఆ కుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమృతనగర్‌లో చాలా వీధుల్లో విద్యుత్ తీగలు ఇళ్ళను ఆను కుని వుండడం ఇంటిపైన లైన్లు పోతున్నట్లు స్ధానికులు చెబుతున్నారు. ఇందువల్ల ప్రమాదా లు జరిగినా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహిస్తున్నారు. బాబ్జాన్ కుటుంబానికి విద్యుత్ సంస్ధ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.