AP News: సీఎం జగన్‌కు మరో షాక్.. ఇద్దరు డిఎస్పీల బదిలీ..
ABN , Publish Date - May 05 , 2024 | 12:00 PM
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తోంది. తాజాగా ఏపీలో మరో ఇద్దరు డీఎస్సీలను బదిలీ చేసింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు వరుస షాకులు (Shocks) తగులుతున్నాయి. జగన్‌కు (YCP)కు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) బదిలీ (Transfer) చేస్తోంది. తాజాగా ఏపీలో మరో ఇద్దరు డీఎస్సీ (DSP)లను బదిలీ చేసింది. అనంతపురం టౌన్ డిఎస్పీ వీర రాఘవ రెడ్డి (Veera Raghava Reddy) తోపాటు రాయచోటి డిఎస్పీ మహబూబ్ బాషా (Mahbub Basha)ను సీఈసీ బదిలీ చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం టౌన్ డీఎస్పీ వీర రాఘవ రెడ్డి , రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాలను డీజీపీ బదిలీ చేశారు. వారిని వెంటనే తమ కింది అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వులిచ్చారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఇద్దరు డీఎస్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ.. టీడీపీ నేతలపై ఇటీవల డీఎస్సీ వీరరాఘవరెడ్డి కేసు నమోదు చేశారు. దీంతో ఆ డీఎస్పీపై ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. సీఈసీ ఆదేశాల మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది: హరీష్ రావు
రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News