సంస్కృతికి చుక్కాని తెలుగు
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:08 PM
ప్రపంచంలోని 6600 భాషల్లో 16వ భాషగా గుర్తింపు తెచ్చుకున్న అత్యంత ప్రాచీన భాష అయిన తెలుగే అన్ని భాషలకు మూలమని వక్తలు కొనియాడారు. ప్రపంచ భాషల్లో అత్యంత గొప్పదైనది, మధురమైనది తెలుగుభాష అన్నారు.
భాషలకు మూలం తెలుగు
ప్రపంచ భాషల్లో 16వ స్థానం
అత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు
తెలుగుభాషను గౌరవించాలి
ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ప్రపంచంలోని 6600 భాషల్లో 16వ భాషగా గుర్తింపు తెచ్చుకున్న అత్యంత ప్రాచీన భాష అయిన తెలుగే అన్ని భాషలకు మూలమని వక్తలు కొనియాడారు. ప్రపంచ భాషల్లో అత్యంత గొప్పదైనది, మధురమైనది తెలుగుభాష అన్నారు. ఇందులోని నుడికారాలు, సామెతలు, శబ్దపల్లవా లు, అవధాన ప్రక్రియ మరే భాషలో లేవన్నారు. గ్రాంధిక భాషగా ఉన్న తెలుగును వ్యవహారిక భాషలోకి మార్చడానికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి ఎనలేనిదని, తెలుగుభాషా వికాసానికి గురజాడ, కందుకూర కృషి ప్రశంసనీయమని, రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, శ్రీశ్రీ, వంటి మహాకవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారని కొనియాడారు.
ప్రొద్దుటూరు టౌన్, ఆగస్టు 29: ఎన్ని భాషలు నేర్చుకున్నా తల్లిభాష అయిన తెలుగుభాషను గౌరవించాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం మాతృభాష దినోత్సవం సందర్భంగా గాంధీపార్కులో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు తెలుగుభాషపై మమకారం పెంచాలని సూచించారు. జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని మాతృభాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కొత్తపల్లి శ్రీను, సాధు గోపాలక్రిష్ణ, కంభం పాములేటి, ఆరవేటి రాజా, సుబ్బరాయుడు, కాశీవరపు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
భారతీయ భాషల్లో మేటి తెలుగు
జమ్మలమడుగు, ఆగస్టు 29: భారతీయ భాషల్లో మేటి తెలుగని ఎంఈఓ చంద్రశేఖర్‌రావు అన్నారు. జమ్మలమడుగులో తెలుగుభాష, క్రీడాదినోత్సవాల ను ఘనంగా చేసుకున్నారు. గూడెం చెరువు హై స్కూల్‌లో హెడ్మాస్టర్ కవిత, ఉపాధ్యాయులు గురుకుమార్, విద్యాసాగర్, వెంకటసుబ్బయ్య, సుజాత, మంజుల, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ జింకా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మాతృభాష దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ బండారు శ్రీనివాసులు మాట్లాడారు. కథ, రచయిత దర్పణం శ్రీనివాస్‌ను సన్మానించారు. ఉపాధ్యాయులు అమీర్, నరసింహులు, దాదాఖలందర్, లక్ష్మినారాయణ, రామయ్య, సుబ్బారెడ్డి, మధుబాబు, గిరి, పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడా, తెలుగుభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగుభాషా దినోత్సవం చేసుకున్నారు. అధ్యాపకులు సంజీవరెడ్డి, పీడీ షఫి, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగుభాష ప్రశస్తిని కాపాడుకుందాం
బద్వేలు, ఆగస్టు 29: తెలుగుభాషా వైభవాన్ని, విశిష్టతను కాపాడుకుందామని చిన్నకేశంపల్లె జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం పెంచలయ్య పిలుపు నిచ్చారు. తెలుగుభాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్స వాలను నిర్వహించారు. తెలుగుటీచర్ మాదన విజయ్‌కుమార్ మాట్లాడారు. ఉపాధ్యాయులు సుబ్బరాయుడు, వరలక్ష్మి, గౌస్ బాష పాల్గొన్నారు.
మానవ జీవితాలకు వెలుగు మాతృభాష తెలు గు అని తెలుగు భాషావికాస ఉద్యమ, మొల్ల సాహితీపీఠం అధ్యక్షుడు గానుగపెంట హనుమంత రావు పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీ లో తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు, ఎంపీడీఓ రామక్రిష్ణ, అష్టావధాని శివశ్రీశర్మ, ఎస్‌ఐ సత్యనా రాయణ తదితరులు పాల్గొన్నారు.
మనసును తీర్చిద్ది సంస్కారం నేర్పే భాష తెలు గు భాష అని వీరారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటసుబ్బారెడ్డి అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఏ యూనిట్ ఆధ్వర్యంలో తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవాలను నిర్వహించారు. వృత్తి విద్యా కళా శాల ప్రిన్సిపాల్ శ్యాం సుందర్, ఎన్‌ఎస్‌ఎస్ సమ న్వయకర్తలు దొరస్వామి నాయక్, ఈశ్వరయ్య, మ హేష్, ఫిజికల్ డైరెక్టర్ ఆదినారాయణ రెడ్డి, జి.శ్రీని వాసులు తదితరులు పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో డిగ్రీ కళాశాలలో మాట్లాడుతున్న వక్త
పోరుమామిళ్ల డిగ్రీకళాశాలలో...
పోరుమామిళ్ల, ఆగస్టు 29: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ తెలుగుభాషా దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రకాశ్‌రావు అధ్యక్షతన గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా, క్రీడాదినోత్సవాలను నిర్వహించారు. అధ్యాప కులు సులోచన తదితరులు పాల్గొన్నారు.
పిట్టిగుంట హైస్కూల్‌లో...
కాశినాయన ఆగస్టు29: అన్ని భాషలకు మాతృభాష మూలాధారమని పిట్టిగుంట ప్రభుత్వ ప్రాధమి కోన్నత పాఠశాల హెచ్‌ఎం నారాయణస్వామి, ఉపాధ్యాయుడు జి.రమణారెడ్డి పేర్కొన్నారు. విద్యా ర్థులకు పద్యాలు, కథల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
గురుకుల పాఠశాలలో...
బి.కోడూరు, ఆగస్టు 29: సగిలేరు గురుకుల పాఠశాలలో తెలుగుభాషా దినోత్సవం నిర్వహించా రు. ఆధ్యాత్మిక రచయిత జాతీయ అవార్డు గ్రహీత కృష్ణానాయక్, ప్రిన్సిపాల్ నిరంజన్, వైస్ ప్రిన్సిపల్ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జడ్పీ బాలికల హైస్కూల్‌లో...
బ్రహ్మంగారిమఠం. ఆగస్టు 29: స్థానిక జడ్పీ బాలిక ల హైస్కూల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తెలుగుభాషా, క్రీడా దినోత్సవాలు నిర్వ హించారు. క్రీడాపోటీల్లో విజేతలకు మెమెంటోలు అందించారు. సీనియర్ అధ్యాపకులను సన్మానించా రు. హెడ్మాస్టరు నిర్మలదేవి, తెలుగు టీచర్ లెక్కల కొండారెడ్డి, ప్రిన్సిపాల్ పద్మనాభమూర్తి, అధ్యాపకు లు, వైద్యాధికారి సంపత్‌కుమార్ పాల్గొన్నారు.